గూడెం ఎమ్మెల్యే చావు కోసం ఎదురు చూస్తున్నది ఎవరు?

Publish Date:May 2, 2025

Advertisement

తాడేపల్లిగూడెంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన కూటమి నేతల మధ్య అసంతృప్తికి అద్దం పడుతోంది.  తాను చనిపోతే  బైఎలెక్షన్ కోసం కొందరు ఎదురు చూస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు తాడేపల్లిగూడెంలో బై ఎలక్షన్ కోసం ఎదురుచూస్తున్నది ఎవరు అన్న చర్చ మొదలైంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి రాష్ట్రంవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంత ఘన విజయాన్ని సాధించాయి.  ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి స్నేహం 20 ఏళ్ల పాటు కొనసాగుతుందనీ.. మళ్లీ, మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ అంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణుల మధ్య అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ బాహుబలి అని ప్రేమగా పిలుచుకునే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దానికి అద్దంపడుతున్నాయి. 

చాలా కష్టపడి రాజకీయాల్లోకి వచ్చానని, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా ఎమ్మెల్యే అయిన తాను ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకుంటున్నాని బొలిశెట్టి శ్రీనివాస్ మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. అలాంటాయన తాను చనిపోతే బాగుండు, బైపోల్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేగా తనను ప్రజలు గెలిపించుకున్నారని, ఎవరో త్యాగం  చేస్తే  తాను ఎమ్మెల్యే అవ్వలేదని చురకలు అంటించారు.

అసలు బొలిశెట్టి శ్రీనివాస్‌ను  అంత మానసిక క్షోభకు గురి చేసింది ఎవరు అనే దానిపైనా రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలతో జనసేన, టీడీపీల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు,  ఇటు ఎమ్మెల్యేతో పాటు జనసేన ముఖ్య నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నారన్నది వాస్తవం అంటున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి బొలిశెట్టి శ్రీనివాస్ తన దైన శైలిలో ప్రజల్లో దూసుకుపోతున్నారు. మిత్రపక్షాలకు ఇబ్బంది లేకుండా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ   ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం  చేస్తున్నారు. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఒక్కసారిగా ఆవేదనతో మాట్లాడటంతో అసలు ఏమైంది అనే దానిపై రాష్ట్ర నేతలు సైతం ఆరా తీయటం మొదలు పెట్టారంట
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం సైతం బలోపేతంగా ఉంది. వైసీపీ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను ఎదుర్కోవటంలో జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్చార్జ్ వలవల బాబ్జి తమదైన శైలిలో పోరాడారు. అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కూటమి ఏర్పడిన తర్వాత  తాడేపల్లిగూడెం టికెట్‌ని అనూహ్యంగా జనసేన కైవసం చేసుకుంది. కూటమి వేవ్ కలిసి వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలిచారు. 

టీడీపీ ఇన్చార్జిగా ఉన్న వలవల బాబ్జికి ఏడాది కావస్తున్నా  ఏ పదవి ఇవ్వకపోవడంపై టిడిపి నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. బాబ్జి తనకు పదవుల మీద ఆశ లేదంటూనే తనదైన మార్క్ చూపించుకోవడానికి నియోజకవర్గంలో ప్రయత్నాలు చేయటం ఇటు జనసేన నేతలకు కొంత ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి తన ఇంట్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం పెట్టడం ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు నచ్చలేదట. 

మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన బలోపేతంలో భాగంగా ఇతర పార్టీల నుండి వచ్చే బలమైన నేతలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ నుండి జనసేనలోకి వలసలు పెరగడంతో వలవల బాబ్జి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల నియోజకవర్గంలో జిల్లా అధికారుల పర్యటన సమయంలో వలవల బాబ్జిని పిలవలేదు.  దాంతో ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలు కొందరు అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలు వల్లే..  ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారంట. టీడీపీ నేతలు అక్కడ, ఇక్కడ మాట్లాడిన మాటలు నేరుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెవిన పడటంతో ఆయన మనోవేదనకు గురయ్యారని జనసైనికులు చెప్తున్నారు. 

తమకన్నా తెలుగుదేశం నేతలకే బొలిశెట్టి శ్రీనివాస్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నా వారు ఇంకా ఆయన్న టార్గెట్ చేయడాన్ని జనసేన పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో పై చేయి కోసం   ఇటు టీడీపీ,  అటు జనసేన నేతలు బహిరంగ విమర్శలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేకి తెలియకుండా టీడీపీ నేతలు అధికారులకు ఫోన్లు చేసి తమ పనులు చేయాల్సిందేనని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరిస్తున్నారంట. అధికారులు ఇదే విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్లడంతో టీడీపీ, జనసేన మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిర్గతం అయిందంటున్నారు. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఈ రచ్చ అంతటికీ కారణం రాబోయే మున్సిపల్ ఎన్నికలే అంటున్నారు. ఆ ఎన్నికల వాటాల్లో జనసేనపై పైచేయి సాధించేందుకే  టీడీపీ నేతలు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.