Publish Date:Jun 12, 2026
ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ల వరకూ విద్యుత్ చార్జీలు పెరగవు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. జగన్ హయాంలో వరుసగా పెరిగిన కరెంట్ బిల్లులతో సగటు సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చే మూడేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని చేసిన ప్రకటన పట్ల ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రగతి నివేదికను, భవిష్యత్ ప్రణాళికలను మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని.. ఆ విధ్వంసాన్ని తాము కేవలం ఈ రెండేళ్ల స్వల్ప కాలంలోనే పూర్తిగా సరిదిద్ది, వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించామని వివరించారు.
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సాహసోపేతమైన, ప్రజానుకూలమైన నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదనీ, రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ చార్జీలను పంచే ప్రశక్తే లేదనీ గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
జనన్ ఐదేళ్ల పాలనలో ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచి, సామాన్య వినియోగదారులపై మోయలేని రీతిలో అదనపు ఆర్థిక భారాన్ని మోపారన్న ఆయన.. గత ప్రభుత్వం వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన ట్రూ అప్ భేదాలకు తాము శాశ్వతంగా స్వస్తి పలికామని చెప్పారు.
రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తాము ట్రూ డౌన్ అనే విప్లవాత్మక విధానాన్ని ప్రవేశపెట్టామని గర్వంగా వెల్లడించారు. ఈ ట్రూ డౌన్ విధానం ద్వారా యూనిట్‌కు ఏకంగా 13 పైసల చొప్పున విద్యుత్ ఛార్జీలను తగ్గించామని ఆయన వివరించారు. ఈ అద్భుతమైన నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారులకు 4,498 కోట్ల రూపాయల మేర ఆర్థిక ఉపశమనం లభించిందని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-question-of--increasing--electricity-charges-36-222717.html
సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచాయి. SBI, HDFC, PNB మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 7.50% నుండి 9.00% వరకు లభిస్తున్న గరిష్ట వడ్డీ రేట్లు, కాలపరిమితి మరియు పన్ను ఆదా వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ నెల 1న ఆయన ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో సమాజ శాంతిని దెబ్బతీసేలా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఏ మాత్రం మంచివి కావన్నారు.
నోయిడాకు చెందిన సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ క్రాటికల్ టెక్ Kratikal Tech BSE SME ప్లాట్‌ఫామ్‌పై గ్రాండ్‌గా లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ట్రేడింగ్ నిబంధనలు, పెట్టుబడి వివరాలు మరియు థ్రెట్‌కాప్ ThreatCop సాస్ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తుపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్ 16లో అమెరికాకు ఘోర పరాజయం. 4 1 గోల్స్ తేడాతో అమెరికాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన బెల్జియం. చార్లెస్ డీ కెటిలేరి అద్భుతమైన డబుల్ గోల్స్ హైలైట్.
నాసిక్ టీసీఎస్ యూనిట్లో టెలికాలర్‌గా పనిచేసిన నిదాఖాన్, యూనిట్ లో మతమార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పరారయ్యారు. దాదాపు 42 రోజుల పాటు అజ్ఝాతంలోకి వెళ్లిన ఆమెను పోలీసులు మేలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఆటపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ సిరీస్ మరియు టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
ప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది.
సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో జతకట్టి, విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా అనుమతులు లభించినట్లు అపాక్ట్ సీఈవో వెల్లడించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.