కాగడా పెట్టి వెతికినా కనిపించని పొలిటికల్ హార్మనీ!

Publish Date:Feb 20, 2023

Advertisement

భిన్నత్వంలో ఏకత్వం.. భారత్ డీఎన్ఏలోనే ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా చెబుతుంటారు. దేశంలో ప్రజల మధ్య సామరస్యం సంక్షోభమో, సమస్యో వచ్చిన ప్రతి సారీ కనిపిస్తూనే ఉంటుంది. అకేషన్ కు అనుగుణంగా దేశ ప్రజలు ఐక్యతను చాటుతూనే ఉన్నారు. దేశంలో మతసామరస్యం కోసం రాజకీయ నాయకులు, పార్టీలూ శ్రమించాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలకు తమ ఐక్యతను ఎలా చాటాలో, ఎప్పుడు చాటాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కుల,మత, వర్గ విభేదాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అని జనం పదే పదే చాటుతున్నారు.

వాస్తవానికి సామరస్యం ఉండాల్సింది రాజకీయ పార్టీల మధ్యే. రాజకీయ నేతల మధ్యే. ప్రజాస్వామ్య మనుగడలోనే ప్రమాదంలో పడేసేంతగా రాజకీయ పార్టీల మధ్య ప్రత్యర్థి పార్టీలు అన్న భావన సమసిపోయి, శతృపార్టీలా అన్నంతగా విభేదాలూ, విద్వేషాలు ప్రజ్వరిల్లుతున్నాయి. వాస్తవానికి రాజకీయ పార్టీల మధ్య వైరుథ్యాలు, విభేదాలు సైద్ధాంతిక పరిధి దాటేసి వైరి పక్షాల స్థాయికి చేరిపోయింది. ఈ ధోరణి ఇందిరా గాంధీ హయాం నుంచీ కనిపిస్తున్నా.. ఇఫ్పుడు మోడీ హయాంలో మాత్రం కొత్త ఎత్తులకు ఆ ప్రమాదకర ధోరణి చేరింది. పార్లమెంటు సమావేశాలలో పార్టీల సభ్యులు బద్ధ శత్రువుల్లా మారి ఘర్షణలకు సైతం దిగుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలు వ్యక్తిగత దూషణలకు, పరస్పర నిందారోపణలకు పరిమితమౌతున్నాయి.

రోజుల తరబడి సభా కార్యక్రమాలు జరగకుండా వాయిదాల పర్వం నడవడం అన్నది గతంలో ఎప్పుడూ, ఎన్నడూ లేని విధంగా ఇప్పుడొక ఆనవాయితీగా మరిపోయింది.  పార్టీల ఈ తీరు, వైఖరి  ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. విపక్షాల సూచనలను విమర్శలను ఖండించడానికే అధికార పార్టీ సభ్యులు ఉన్నారా అన్నట్లుగా బీజేపీ, మిత్రపక్షాలు వ్యవహరిస్తుంటే.. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించడానికే ఉన్నట్లుగా విపక్ష సభ్యుల తీరు కనిపిస్తోంది.  రాజకీయ పార్టీల ఈ వైఖరి కారణంగా ప్రజాహితం, దేశ హితం, ప్రజా హితం కోసం చర్చలు జరగడం లేదు. పరస్పరం గౌరవించుకుంటూ.. ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలకు వేదికగా నిలవాల్సిన పార్లమెంటు.. ఒక కుస్తీగోదాలా మారిపోయింది.

అధికార విపక్ష సభ్యులు పరస్పర నిందలు, ఆరోపణలతో పార్లమెంటు సమావేశాలలో అర్ధవంతమైన చర్చ ను అటుంచి అసలు సమావేశాలనే అర్ధరహితంగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అప్రజాస్వామిక విధానాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించాయి. ఒక అంశంపై చర్చ విషయంలో మంచి చెడుల సంగతి ఇసుమంతైనా పట్టించుకోకుండా.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, కనుక మనం సమర్ధించాలి అన్నట్లుగా అధికార పక్షం, అధికార పక్షం సమర్ధిస్తోంది కనుక మనం వ్యతిరేకించాలి అన్నట్లుగా విపక్షం తమ తమ పట్టుదలలకే పరిమితమై ప్రజలను, ప్రజా సమస్యలను గాలికొదిలేశాయి.

ఆరోగ్యకర పార్లమెంటరీ వ్యవస్థలో పాలక, ప్రతిపక్షాల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, కాగడా పెట్టి వెతకినా కనిపించడం లేదు.  దురదృష్టవశాత్తూ పాలక, ప్రతిపక్షాలు మధ్య  ద్వేష భావమే తప్ప సుహృద్భావం  మచ్చుకైనా లేదు. అందుకే సమాజంలోనూ విద్వేష ధోరణులు గోచరిస్తున్నాయి.  ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే ముందుగా రాజకీయ పార్టీలలోనూ, ఆయా పార్టీల నాయకులలోనూ మార్పు రావాలి. సామరస్య ధోరణి రాజకీయ పార్టీలలో కనిపించాలి. 

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.