కన్నా క్లారిటీ.. టీడీపీలోకే!

Publish Date:Feb 19, 2023

Advertisement

కన్నా లక్ష్మినారాయణ తాను ఏ పార్టీలో చేరబోతున్నాన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.   భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం ఆయన తన అనుచరులతో  సమావేశమై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదని ఆ సమావేశంలో అత్యధికులు చెప్పడంతో కన్నా తాను తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల  23న చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీ కండువా కప్పుకుంటారని ఆయన అనుచరులు తెలిపారు.  కన్నాను తమ పార్టీలో చేర్చుకునేందుకు  జనసేనతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేసింది.  వైసీపీ నుంచి కూడా కన్నా కోసం ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు.  ఇక  కన్నా లక్ష్మినారాయణకు టీడీపీలో చేరేందుకే  నిర్ణయించుకోవడంతో తెలుగుదేశం పార్టీకి  చేరికతో టీడీపీకి అదనపు బలం చేకూరినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీలో కన్నాకు పొమ్మన లేకపోగపెట్టిన చందంగా వ్యవహరించిన సోము వీర్రాజు చేజేతులా పార్టీకి ఇంతో అంతో ఉన్న బలాన్ని కూడా దూరం చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఒక్క కన్నా లక్ష్మీనారాయణ అనే కాదు.. రాష్ట్ర విభజన తరువాత అటు కాంగ్రెస్ లో ఇమడ లేక, ఇటు తెలుగుదేశంలోనో, మరో పార్టీలోనో చేరలేక బీజేపీలో చేరిన పలువురు మాజీ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో ఉక్కపోతకు గురౌతూనే ఉన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చేప్పేశారు. ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారని చాలా కాలంగా, అంటే ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన నాటి నుంచీ ప్రచారం జరుగుతున్నా.. ఆయన ఏ పార్టీలో చేరతారన్న విషయంలో నిన్న మొన్నటి దాకా క్లారిటీ లేదు. జనసేనలోనా, తెలుగుదేశంలోనా అన్న చర్చ జరిగింది. అయితే తెలుగువన్ మాత్రం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన నాడే ఆయన రూటు తెలుగుదేశం వైపే అని చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. కన్నా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించేశారు. అయితే కన్నా బాటలోనే నడిచే నేతలు ఏపీ బీజేపీలో ఇంకా పలువురు ఉన్నారు. కేంద్ర మాజీ  మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా త్వరలోనూ బీజేపీ గూటిని వీడే అవకాశం ఉంది.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు పట్ల ఆమె బహిరంగంగానే తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా త్వరలో పార్టీ వీడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక పార్టీ నుంచి వైదొలగి, తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన కన్నా ప్రధాని మోడీ పట్ల తనకు గౌరవం, నమ్మకం ఉన్నప్పటికీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని ప్రకటించారు. ఒక దశలో కన్నాను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్ఠానం ఒక కేంద్ర మంత్రిని రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది.  ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలకు, అలాగే గత నెల  24న భీమవరంలో  జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ కూడా కన్నా   డుమ్మా కొట్టినప్పుడే ఆయేన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైపోంది.  ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరడం ఖాయమని కూడా పరిశీలకులు తేల్చేశారు.  వాస్తవానికి బీజేపీకి కన్నా గుడ్ బై చెప్పేందుకు గ్రౌండ్ గత  ఏడాది డిసెంబర్ లోనే  ప్రిపేర్ అయ్యింది.   జనసేన రాజకీయ వ్యవహారాల  కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.  

అ పాత మిత్రులం  కదా  అందు  ఓ సారి  కలిసి కబుర్లు చెప్పు కున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని  అటు నాదెండ్ల, ఇటు కన్నా కూడా అప్పట్లో చెప్పినా వారి మాటలను ఎవరూ విశ్వసించలేదు.   అప్పట్లోనే జనసేనలో  కన్నా లక్ష్మీనారాయణ  చేరిక అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ బీజేపీలో కన్నా ఉక్కపోతకు కారణం ఎవరంటే మాత్రం కచ్చితంగా సోము వీర్రాజే అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.  కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న సమయంలో  నియమించిన ఆరు  జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు  తొలగించారు. దీంతో  అంతవరకూ కొంత సైలెంట్ గా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు  జనసేనతో    సంబంధాలు బలహీనం అవ్వడానికి కూడా   సోము వీర్రాజ  వైఖరే కారణమని  కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ  బహిరంగంగానే  తప్పుబట్టారు.  కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో  ఏం జరుగుతుందో  పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్  స్టార్ట్ అయిందని, ఆ తరువాత  రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరు కావడంతో   ఆయన పార్టీ మారడం ఖాయమని అప్పట్లోనే నిర్ధారణ అయ్యింది.  అయితే కన్నా ఏ పార్టీలో, ఎప్పడు చేరుతున్నారు అన్నదే తేలాల్సి ఉందని అప్పట్లో పరిశీలకుల పేర్కొన్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు   కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. ఇప్పుడు కన్నా తెలుగుదేశంలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించేసి క్లారిటీ ఇచ్చేశారు. 

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.