సర్వేలపైనే భారం.. గెలుపు గుర్రాలకే టికెట్లు.. సిట్టింగులకు గ్యారంటీ లేదు!

Publish Date:Feb 22, 2023

Advertisement

ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలూ కసరత్తులు ప్రారంభించేశాయి. అధికార పార్టీని మినహాయిస్తే మిగిలిన ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. అధికార బీఆర్ఎస్ మాత్రం ప్రజలలోకి వెళ్లి వారి ఆదరణను చూరగొనడం కంటే.. సర్వేలపైనే భారం వేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారు.

ఆ సర్వేల ఫలితాలను పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఎవరికి పార్టీ టికెట్లు ఇస్తే విజయం సాధిస్తారు అన్న విషయంపై తాజాగా మరో సర్వే చేయిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఆయన సిట్టింగులకందరికీ టికెట్లు అని ప్రకటించిన సంగతి తెలిసందే. అయితే ఇప్పుడు మాత్రం సిట్టింగులకు టికెట్ గ్యారంటీ కాదు అన్న సంకేతాలను పంపిస్తున్నారు.  తాజాగా నిర్వహించనున్నసర్వేలో గెలుపు గుర్రాలెవరన్నది తేలుతుందని, ఆ సర్వే ప్రకారం గెలిచే వారికే వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  గతంలో పలు సందర్భాలలో  సిట్టింగ్‌లందరికీ పార్టీ టికెట్లు ఇస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ గ్యారంటీ లేదని చెప్పకనే చెబుతున్నారు. కేసీఆర్ గతంలో సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించిన సందర్భంలో టికెట్లు ఇస్తామని ప్రకటించిన సందర్భాలలో పార్టీలో ఒక్క సారిగా ఉవ్వెత్తున అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి.  

ఎందుకంటే  ఆపరేషన్ ఆకర్ష్ పేరిట 2019 ఎన్నికలలో వేరే పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. దాంతో తొలి నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసి.. ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన వారు.. ఇప్పుడు గత ఎన్నికలలో తమ ప్రత్యర్థులకే పార్టీ టికెట్ ఇస్తామనీ, వారి విజయం కోసం పని చేయాలని అధినేత ఆదేశించడంతో పార్టీ శ్రేణుల్లోనే కాదు.. నాయకులలో కూడా అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ కారణంగానే  సందర్భాల్లో హామీ ఇచ్చిన ఆయన.. తాజాగా క్షేత్రస్థాయి పరిస్థితిని తెప్పించుకుంటున్నారు. అదీ కాక మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వంటి మంత్రులు సిట్టింగులలో అత్యథికులు టికెట్లు ఇచ్చినా గెలవలేరని బహిరంగంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. ముఖ్యంగా  పాతిక మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి మీడియా ముఖంగా చెప్పడం, అదీ కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని ప్రకటించిన తరువాత చెప్పడం అప్పట్లో బీఆర్ఎస్ లో సంచలనం సృష్టించింది.  

ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చాలా చక్కని, దగ్గరి సంబంధాలే ఉన్నాయి. అవును ఒక్కప్పుడు తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, ఎర్రబెల్లి   ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా తీవ్రంగా దూషించారు. దుర్భాష లాడారు. అయినా  ఎర్రబెల్లి తనను ఎంత లేసి మాటలన్నా  ఎంతగా దూషించినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అంటే అది మామూలు బంధం కాదు. చాలా గట్టి బంధం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎర్రబెల్లి  దయాకరరావు చేత కేసీఆరే ఆ మాట అనిపించారా అన్న అనుమానాలు కూడా అప్పట్లో రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. సరే కారణాలేమైతేనేం సిట్టింగులందరికీ టికెట్లు అన్న విషయంలో కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారనీ, అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు అన్న నిర్ణయానికి వచ్చారనీ అంటున్నారు.

సిట్టింగులలో గెలిచే వారెవరు అన్న విషయంపైనే ఆయన రానున్న రెండు మూడు రోజుల్లో సర్వే చేయించనున్నారనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాలలో  ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఈ సారి విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయి, ఒక వేళ ప్రజలలో వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్ అన్న అంశాలపై ఈ సర్వే ఉంటుందని చెబుతున్నారు.   

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.