Vijayawada: ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు.!

Publish Date:Oct 14, 2026

Advertisement

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు. శ్రీ మహా చండీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థించారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేశ్ పాశ్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర తదితరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు.

అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారి అంతరాలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు ఎనిమిది నిమిషాల పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. దర్శనానంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం ఈవో అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, హోంమంత్రి వంగలపూడి అనిత శేషవస్త్రాలను అందజేశారు.

ఆలయానికి చేరుకునే సమయంలో, తిరిగి వెళ్లే క్రమంలో రాష్ట్రపతి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అభివాదం చేశారు. దేశ ప్రథమ పౌరురాలు తమ మధ్యకు రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రి, విజయవాడ నగరంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మను దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆమె పర్యటన ప్రశాంతంగా ముగిసింది.

 

 

 

[ President Droupadi Murmu, Vijayawada Kanaka Durga Temple, Indrakiladri temple visit, Rashtrapati Murmu AP tour, Governor Justice Abdul Nazeer, Kamlesh Paswan, Pemmasani Chandrasekhar, CM Chandrababu, Home minister anitha ]


 

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.