Publish Date:Oct 24, 2024
ప్రపంచం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో సమష్టిగా అందరూ కలిసిరావాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని తేల్చి చెప్పారు. బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంలో అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో ప్రసంగించిన మోడీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఏకతాటిపై నిలిచి, పరస్పరం మద్దతు సహకారంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
భారత్ ఎప్పుడూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికే మద్దతు తెలుపు తుందన్నారు. శాంతి చర్చల ద్వారానే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం లభిస్తుందని మోడీ అన్నారు. కొవిడ్ లాంటి మహమ్మరిని సమష్టిగా ఎదుర్కొన్న తరహాలోనే మనమంతా కలిసి భావి తరాలకు భద్రతమైన, పటిష్ఠమైన భవిష్యత్తును అందించేందుకు అవకాశాలను సృష్టించాలని మోదీ సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-dual-standards-in-fight-against-terrorism-25-187320.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.