ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి ప్రధాని ఆహ్వానం: హస్తినకు చంద్రబాబు, పవన్.!

Publish Date:Nov 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనకు బయలు దేరారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. పార్లమెంటు సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జరుగుతున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సదస్సు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించకుంది.  

నవంబరు 30 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుండటం విశేషం.  డీలిమిటేషన్,  మహిళా రిజర్వేషన్ బిల్లులు గతంలో తగినంత మెజారిటీ లభించక ఆమోదం పొందని నేపథ్యంలో ఈసారి వీటిని ఆమోదింపజేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు  ముమ్మరం చేసింది. అందులో భాగంగానే భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చించి, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ బిల్లుల్లో సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, సీట్ల సమతుల్యత వంటి అంశాలపై చర్చలు, ఆందోళనలు వినిపిస్తున్న తరుణంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగడం విశేషం. ఈ బిల్లులపై మిత్రపక్షాలకు కేంద్రం ఎలాంటి స్పష్టత ఇస్తుంది, ఏయే అంశాలపై ఏకాభిప్రాయం కుదురుతుందనే దానిపై అందరి  దృష్టీ నిలిచింది.

రాజ్యాంగ సవరణ అవసరమైన బిల్లుల ఆమోదం నేపథ్యంలో ఎన్డీయే కూటమి   పార్టీల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమగ్రంగా చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేందుకే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.   దక్షిణాది రాష్ట్రాలు, ప్రాంతీయ అంశాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, కూటమి భాగస్వాముల మధ్య జరిగే సంప్రదింపులు కీలకంగా మారాయి.  

ఇది కూడా చదవండి: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్: వైసీపీ సైలెన్స్.. విభేదాల ప్రచారానికి ఎండకార్డ్.!

ఢిల్లీ సమావేశం ముగిసిన తర్వాత ఈ భేటీలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు వెలువడే అవకాశం ఉంది. నవంబరు 30న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే నాటికి  డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ బిల్లుల విషయంలో ఒక స్పష్టత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

ఎన్డీయే సమావేశంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఏ విధమైన స్పష్టత వస్తుంది, తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రజలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు:  ప్రొటోకాల్ పక్కన పెట్టి, భద్రతను తోసిరాజని: బాబుతో పవన్ భేటీ: రాజీనామా వదంతులకు ఫుల్ స్టాప్.!

పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీకి గైర్హాజరుపై చర్చోపచర్చలు.!

[Chandrababu Naidu Pawan Kalyan  Delhi Tour, NDAmeeting, PM, Invites, Delimitation,Women  Reservation Bills, TeluguOne] 

By
en-us Political News

  
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.