విశ్వాసం లేని దర్శనాలు వద్దు
Publish Date:Aug 15, 2012
Advertisement
కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమలేశుని దివ్యదర్శనం ఇకపై విశ్వాసం పాతిపదికపై మాత్రమే హిందూయేతరులకు లభిస్తుందట! అన్యమతస్థులు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు శ్రీవారిపై తమకు విశ్వాసం ఉన్నట్లుగా విధిగా డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన చాలాకాలం నుంచే ఉన్నా ఏనాడూ అది అమలుజరుపనేలేదు! ఈమధ్యకాలంలో వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్రెడ్డి తిరుమల వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చినప్పుడు ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వనేలేదు. ఈ విషయం వివాదాస్పదం కావడంతో డిక్లరేషన్ నిబంధనను టిటిడి కఠినతరం చేసింది. ఇది సమసమే అయినప్పటికీ` కేవలం అన్యమతస్థుల నుంచి మాత్రమే డిక్లరేషన్ తీసుకోవాలన్న నిబంధనను శ్రీవారి దర్శనార్ధం వచ్చే అందరికీ వర్తింపచెయ్యడం మంచి పద్దతంటూ భక్తులు సూచిస్తున్నారు. తద్వారా విశ్వాసం లేని దర్శనాలు పూర్తిగా నియంత్రణ జరిగి ఆలయ పవిత్రత మరింతగా పెరుగుతుందని వారంటున్నారు!
http://www.teluguone.com/news/content/no-darshan-of-lord-venkateshwara-if-there-is-no-belief-24-16549.html





