అవిశ్వాస తీర్మానం ఫలితం తెలిసిందే ... అయినా ఆసక్తి

Publish Date:Jul 26, 2023

Advertisement

మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టి, ఐదు రోజులుగా సభా కార్యక్రమాలను స్తంబింప చేసిన విపక్ష కూటమి, ఐఎన్డీఐఎ (ఇండియా), ఆఖరి అస్త్రాన్ని సంధించింది. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు  అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌‌ ఇచ్చిన  నో కాన్ఫిడెన్స్   నోటీసును స్పీకర్ ఆమోదించారు. అన్ని పార్టీలతో చర్చించి అవిశ్వాస తీర్మానం పై చర్చకు తేదీని ఖరారు చేస్తారు. అయితే, పార్టీల సంఖ్యా బలాలను  బట్టి చూస్తే  కాంగ్రెస్ పార్టీ  ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

లోక్ సభలో ఎన్డీఎకు 332 మంది సభ్యుల బలముంది. ఎన్డీఎ సఖ్యా బలంలో సగం సంఖ్యా బలం అయినా లేని ఐఎన్డీఐఎ కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమనేది అందరికీ తెలిసిన నిజం. మరో వంక 22 మంది సభ్యులున్న వైసీపీ ఇప్పటికే, ఎన్డీఎకు మద్దతు ప్రకటించింది. అందుకే అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమనే విషయం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా, కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కూడా తెలుసు. నిజానికి, ఇండియాగా పిలుచుకుంటున్న విపక్ష ఐఎన్డీఐఎ కూటమిలో 26 పార్టీలు ఉన్నా, కూటమి ఎంపీల సంఖ్య 140 దాటదు. సో ... కాంగ్రెస్ ఎంపీ  గౌరవ్‌ గొగొయ్‌‌ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. ఈ విషయం కాంగ్రెస్ సహా కూటమి నేతలు అందరికీ తెలిసిందే అయినా, అవిశ్వాస తీర్మానం ద్వారా  మణిపూర్ హింసాకాండతో పాటుగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ఉద్దేశంతోనే  కాంగ్రెస్ పార్టీ  అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.

 అదలా ఉంటే, కాంగ్రెస్ సభ్యుడు గోగోయ్ నోటీసు ఇచ్చేందే తడవుగా స్పీకర్ ఆమోదం తెలపడంలో మతలబు ఏమిటనే ప్రశ్న ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిస్తోంది. విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఆలోచన చేస్తున్నాయని తెలిసిన వెంటనే, బీజేపీ కోర్  కమిటీ సమావేశమై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే అనుసరించవలసిన వ్యూహం పై క్షుణ్ణంగా చర్చిన్నట్లు తెలుస్తోంది. అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాతనే విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే, ఏమి చేయాలనే విషయంలో ప్రభుత్వం, అధికార కూటమి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, కాంగ్రెస్ సభ్యుడు నోటీసు ఇచ్చిందే తడవుగా స్పీకర్  ఆమోదం తెలిపారని అంటున్నారు. 

మణిపుర్  సహా ఈశాన్య భారతంలో పరిస్థితుల పూర్వపరాలను, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన హింసాత్మక సంఘటలను సవివరంగా దేశం ముందుంచడంతో పాటుగా  విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలలో జరుగతున్న పరిణామాలను ఎండగట్టి తద్వారా విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలను ఇరకాటంలోకి నెట్టే వ్యూహంతోనే బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తోందనే విశ్లేషణలు  వినిపిస్తున్నాయి. 

మరో వంక విపక్ష కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుందని, తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని యోచిస్తోంది. అందుకే, ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 అదలా ఉంటే 2019 ఎన్నికలకు ముందు  2018లో యూపీఏ కూటమి మద్దతుతో ఏపీకి నిధుల విషయంలో టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఎన్డీఎకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో మోదీ ప్రభుత్వం సంఖ్యాబలాన్ని చాటుకుంది.  ఇప్పడు మళ్ళీ మరో మారు ఎన్నికలకు సంవత్సరం ముందు మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడం యాదృచ్చికమే అయినా  ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ముఖ్యంగా, అవిశ్వాస తీర్మానం పై చర్చలో ఎవరిది పైచేయి అవుతుంది అనేది మరింత ఆసక్తి రేకిస్తోంది. అలాగే విపక్ష కూటమికి ఇది మరో పరీక్ష కానుందనే అభిప్రాయం కుడా రాజకీయ వరగాల్లో వినవస్తోంది.

మరో వంక   ఇదే అంశంపై విపక్ష కూటమిలో లేని బీఆర్ఎస్  ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు. అంతే కాదు, కాంగ్రెస్ తీర్మానానికి తమ మద్దతు లేదని కూడా ప్రకటించారు. రాష్ట్రపతి, ఉప రాష్టపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపిన బీఆర్ఎస్  అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ కు దూరంగా ఉన్నట్లు చెప్పుకునేందుకు... ప్రత్యేకంగా నోటీసు ఇచ్చింది అంటున్నారు. ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం అవుట్ కం ఏమిటనేది క్లిస్టర్  క్లియర్’గా అద్దంలో ప్రతిబింబంలా స్పష్టంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, దాన్ని ప్రభుత్వం ఆమోదించి, చర్చకు సై  అనడం దేశంలో రాజకీయ వేడిని, ఆసక్తిని రేకెత్తిస్తోందని  చెప్పవచ్చును.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.