Publish Date:Jul 20, 2023
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యకు సంబంధించిన వాటితోపాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్’, ‘నో రిలీజియన్’ అనే కాలమ్‌ను తప్పకుండా చేర్చాలని ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది.
తమ కుమారుడికి నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప అనే వ్యక్తి పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్వరూపతో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ జరిపారు.
‘‘పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛతో పాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది” అని కోర్టు స్పష్టం చేసింది.
నో క్యాస్ట్, నో రిలీజియన్ అనే కాలమ్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సహా అన్ని దరఖాస్తుల్లోనూ చేర్చాలని సూచించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తీర్పులో పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-cast-no-religion-mandatory-says-telangana-high-court-25-158666.html
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.