తగ్గేదేలే.. ఎవరొచ్చినా.. రాకున్నా నా దారి జాతీయ రాజకీయాల వైపే!

Publish Date:Jul 11, 2022

Advertisement

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తగ్గట్లే.. తగ్గేదే లే అంటూ పుష్పలా ముందుకే సాగుతున్నారు. ఎవరు కలిసి వచ్చినా, రాకున్నా తన అడుగు ముందుకేనని స్పష్టం చేస్తున్నారు. అంతే కాదు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసన మోడీ ప్రధాని కాగా లేనిది..  తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న నేను ప్రధాని ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేసిన దాని కన్నా వంద రెట్లు తాను తెలంగాణను ప్రగతి పథంలో నడిపించానని చెప్పుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఎనిమిదేళ్ల కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రాలలో ఒకటిగా నిలిపిన తనకు.. దేశాన్ని ఎలా ముందుకు నడపాలో మోడీ కాంటే బాగా తెలుసునని అంటున్నారు.

బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన రోజుల మీడియా సమావేశంలో మోడీకి   ప్రశ్నలూ సంధించి వాటికి సమాధానాలు చెప్పమని సవాల్ చేసి.. ప్రధాని ప్రసంగానికి అజెండా నిర్ణయించేశానని చెప్పుకున్న కేసీఆర్.. ఆ తరువాత మోడీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావనే తీసుకురాకపోవడంతో దిగాలు పడ్డారు. అందుకే బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాలు ముగిసిన వారం రోజుల తరువాత తనను తాను కూడదీసుకుని మరోసారి మోడీ పాలనపై ధ్వజమెత్తడానికి మీడియా ముందుకు వచ్చారు. ఒక వైపు రాష్ట్రం కుండపోత వర్షాలతో అతలాకుతలమై ఉన్న సమయంలో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షా సమావేశాన్ని క్లుప్తంగా ముగించేసిన కేసీఆర్.. కేంద్రంపై, మోడీ పాలనపై ధ్వజమెత్తేందుకు మీడియా సమావేశంలో ఎక్కువ సమయమే తీసుకున్నారు.

బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడమేనని ఉద్ఘాటించారు. మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జరగిన బహిరంగ సభలో తానడిగి ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయారని నిందించారు. మోడీ ప్రసంగం పూర్తయిన వారం రోజుల తరువాత కేసీఆర్ తాను మోడీకి సంధించిన ప్రశ్నలు కొత్తవేమీ కాదని వెల్లడించారు. 2014 ఎన్నికలకు ముందు మోడీ అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ను ఏ ప్రశ్నలైతే అడిగారో వాటినే తాను మోడీని అడిగానని అసలు రహస్యం చెప్పేశారు. తన జాతీయ అజెండా కొత్తదేమీ కాదనీ.. ఎనిమిదేళ్ల నాడు యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మోడీ ఏ అజెండానైతే ప్రజల ముందుకు తీసుకువచ్చారో అదే అజెండాతో తాను మోడీని ఎదుర్కొంటానని చెప్పారు. ఈ సందర్భంగా రూపాయి పతనంపై  మోడీ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శల వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించి చూపారు.

  దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రత్యర్ధులపై దాడులకు ఉపయోగించుకుంటున్నారనీ.. అలా వారిని బెదరించి  బీజేపీలో చేర్చుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రప్రభుత్వాలను కూల్చేయడమే కేంద్రం పాలనా తీరుగా మారిపోయిందన్నారు.    సీబీఐ కేసులు ఎదుర్కొని.. ఆ తర్వాత బీజేపీలో చేరి కేసుల ఊసే లేకుండా తిరుగుతున్న నేతల జాబితాను ఈ సందర్బంగా ఆయన బయటపెట్టారు. ప్రధానంగా సుజనా చౌదరి పేరును పలు మార్లు ఉదహరించారు. ప్రధాని మేకిన్ ఇండియా అట్టర్ ప్లాప్ అని విమర్శలు గుప్పించారు. పతంగుల మాంజా నుంచి ప్రతిదీ మేడిన్ చైనాయే అని ఎద్దేవా చేశారు. దేశానికి పాకిస్థాన్ కన్నా చైనాతోనే ప్రమాదం ఎక్కువ అని తనతో పలువురు మాజీ మేజర్లు, లెఫ్టినెంట్ జనరళ్లు చెప్పారనీ, అటువంటి చైనా సరిమద్దుల్లో మోడీ సర్కార్ దేశ భక్తి పేరిట ఆర్మీతో ప్రయోగాలు చేస్తోందని ఆరోపించారు.

అగ్నిపథ్ అనేది ఒక పనికి మాలిన పథకమని చెప్పారు. జవాన్లకు శిక్షణ ఇవ్వడానికే ఆరేళ్లు పడుతుందన్నారు. అటువంటి శిక్షణ లేకుండా కేవలం నాలుగేళ్లలో జవాన్ల కెరీర్  పూర్తి చేసేయడమంటే ఆర్మీ సామర్థ్యాన్ని నీరుగార్చడమేనని దుయ్యబట్టారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోడీ వారి బతుకులను ఆగంఆగం చేశారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు రెండు రోజుల పాటు రైతు ఉద్యమ నేత రాకేశ్  తికాయత్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని రెండు రోజుల పాటు కేసీఆర్ చర్చించారు. అంతే కాకుండా ఆయన మాటలను బట్టి ఆర్మీ మాజీ మేయర్లు, లెఫ్టినెంట్ జనరళ్లతో కూడా ఆయన చర్చించారని అవగతమౌతోంది. మొత్తం మీద కేసీఆర్ బీజేపీపై విసుర్లు, విమర్శలతో మరో సారి రాజకీయ చర్చలకు తనను తాను కేంద్ర బిందువుగా చేసుకోగలిగారు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.