కమలం గూటికి నితీష్?.. ఎప్పుడంటే..?

Publish Date:Apr 3, 2023

Advertisement

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  మళ్ళీ కమలం గూటికి చేరాలని భావిస్తున్నారా? ఆయన చూపు బీజేపీవైపు మళ్లిందా? అంటే బీహార్ రాజకీయాలను నిశితంగా రాజకీయ పరిశీలకులు  వరకు అవుననే అంటున్నారు.  కొద్ది నెలల క్రితం కమలం చేయి వదిలి, లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ) సారథ్యంలోని మహా కూటమితో జట్టు కట్టిన జేడీయు అధినేత నితీష్ కుమార్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పుతున్న నేపధ్యంలో  ఆర్జేడీతో కలిసి ప్రయాణం చేయడం కష్టమనే నిర్ణయానికి వచ్చారని అందుకే అసెంబ్లీఎన్నికలలోగా మళ్ళీ బీజేపీతో చేతులు కలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని పరిశీలకులు  అంటున్నారు.  

నిజానికి, ఎన్నికల వ్యూహకర్త, బీహార్ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అడుగులు వేస్తున్న, ప్రశాంత్ కిషోర్ అయితే ఎప్పటి నుంచో ఈ మాట చెబుతున్నారు. ఎప్పటికైనా నిరీష్ కుమార్ మళ్ళీ బీజేపీ గూటికి చేరటం ఖాయమని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించారు. కాగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏకంగా బహిరంగ వేదికల నుంచే నితీష్ కుమార్   స్నేహ హస్తం చాచుతూ పంపిన సందేశాలను బయట పెట్టారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలోని  బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో మళ్లీ చేరుతామంటూ జేడీయు నాయకులు తమకు సంకేతాలను పంపిస్తున్నారని అమిత్ షా వెల్లడించారు.

అయితే ఎన్డీఏలో చేరికకు జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని, షా  చెప్పారనుకోండి అది వేరే విషయం. అదే సమయంలో అమిత్ షా 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, మోడీనే మూడవసారి ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, 2024 ఎన్నికల తరువాత నితీష్ కుమార్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు.

కాగా  బీహార్ లో పర్యటిస్తున్న కేంద్ర ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తాయరైందన్నారు.  రెండురోజుల క్రితం  శ్రీరామ నవమి పండగ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో అల్లర్లు చెలరేగిన నవడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. శాంతి భధ్రతలను నెలకొల్పే విషయంలో ఇక్కడి ప్రభుత్వంతో చర్చించి ఏ మాత్రం ఉపయోగం లేదని అమిత్ షా అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దించుతున్నామని ప్రకటించారు. అల్లర్లు చెలరేగిన ససారం పట్టణానికి తాను వెళ్లాలేని  దురదృష్టకర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పారు.  

బిహార్ లో జంగిల్ రాజ్ నడుస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిహార్‌లో శాంతి స్థాపన ఎలా సాధ్యమౌతుందని అమిత్ షా అన్నారు.   2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రధానమంత్రి కావాలని నితీష్ కుమార్ ఇప్పటి నుంచే కలలు కంటున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అమిత్ షా అన్నారు.

నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడని జోస్యం చెప్పారు.   రాజకీయ పరిశీలకులు మాత్రం ఇతర పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, జేడీయు, ఆర్జేడీ మధ్య పొత్తు అసెంబ్లీ ఎన్నికల(2025) వరకు కొనసాగడం కష్టమే అంటున్నారు.  లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయని ఆ పరిణామాల నేపధ్యంలో బీహార్ లో ఆర్జేడీ, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీలుగా నిలుస్తాయని, అదే విధంగా జేడీయు కనుమరుగై పోతుందని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.