కేబినెట్ పునర్వ్యవస్థీకరణేనా? ఎవరు ఇన్.. ఎవరు ఔట్?

Publish Date:Apr 3, 2023

Advertisement

వైసీపీ అధినేత తాను టెన్షన్ పడటమే కాకుండా, పార్టీ మొత్తాన్నీ టెన్షన్ లో పడేశారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయంతో కంగుతిన్న జగన్ ఇక  పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల నాటికి బలమైన టీమ్ ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. కొందరేమో క్యాబినెట్ పునరవ్యవస్థీకరణ అంటున్నారు.

మరి కొందరేమో ఏకంగా అసెంబ్లీ రద్దే అంటున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలతో సోమవారం (ఏప్రిల్ 3) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలలోనే కాదు, పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర టెన్షన్ ఏర్పడింది. ఇక ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ శ్రేణుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అన్న టెన్షన్ లో ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం లేదనీ, తన కేబినెట్ పునర్వ్యవస్థీకరించి.. నష్ట నివారణ చర్యలను చేపడతారని జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు అంటున్నారు.

అందులో భాగంగా కొందరు మంత్రులకు, శాఖాపరంగా పట్టు సాధించడంలో విఫలమైన వారూ, అలాగే పార్టీ పరంగా సమన్వయం చేసుకోవడంలో పెద్దగా శ్రద్ధ పెట్టని వారిని తొలగించి, వారి స్థానంలో కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చే ఉద్దేశంలో జగన్ ఉన్నారని అంటున్నారు.  అలాగే సామాజిక న్యాయం విషయంలో కూడా ఈ సారి జగన్ పెద్ద కసరత్తే చేశారని అంటున్నారు. తన కేబినెట్ లో ఇప్పటి వరకూ అవకాశం లభించని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.   కొత్త కేబినెట్ లోకి చేరే వారిలో పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. గోదావరి జిల్లాలలో గట్టి పట్టు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు, అలాగే నెల్లూరు జిల్లాలో రెడ్డి సమాజిక వర్గంలో అసంతృప్తిని తగ్గించేందుకు అదే జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అవకాశం కల్పించాలని జగన్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

 ఇక గత కేబినెట్ లో కీలకంగా వ్యవహరించి ఈ తరువాత ఉద్వాసనకు గురైన బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నానిలకు మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు.  ఇక ఉద్వాసనకు గురికాబోతున్న వారిలో పని తీరు సంతృప్తికరంగా లేని  కాకాణి, సురేష్, మేరుగ నాగార్జున, తానేటి వనిత, గుమ్మలూరు జయరాం, తదితరుల పేర్లు వినవస్తున్నాయి.  మొత్తానికి జగన్ ఎమ్మెల్యేలూ, సమన్వయకర్తల సమావేశం పార్టీలో టెన్షన్ కు కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.