ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా సత్య కుమార్ ?

Publish Date:Jul 3, 2023

Advertisement

ఏపీ బీజేపీ అధ్యక్షుడు మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆస్థానంలో మరో వ్యక్తిని నియమించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.  ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే సోము వీర్రాజు మాత్రం తానే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారు.
ఆయనకు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ అండదండలు ఉండడంతో, వీర్రాజు అధ్యక్ష కుర్చిని వీడకుండా ఉండేందుకు   గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏపీ బీజేపీలో వీర్రాజును వ్యతిరేకించే నాయకులు  రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో  అధిష్టానం ఆయన్ను మార్చాలనే ఆలోచనలో ఉంది.  ఆయనపై వైసీపీ ముద్ర పడడం, వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ రాష్ట్ర  బీజేపీలో గ్రూపులు పెరిగిపోవడం వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఆయనను మార్చాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం.

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన వెంటనే ఏపీ బీజేపీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బిజెపి జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ను నియమించాలని బిజెపి అధిష్టానం పెద్దలు నిర్ణయించుకున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సత్య కుమార్ కు హై కమాండ్ పెద్దల వద్ద పలుకుబడి ఉండడం, ఆయన కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని స్వీకరించాలనే ఆలోచనతో ఉండడం, ఆయనకు వీర్రాజు వ్యతిరేక వర్గం మద్దతు ఉండడం ఇవన్నీ కలిసివచ్చే అంశాలు.

సోము వీర్రాజు వైసీపీ అనుకూల వ్యక్తి అనే ముద్ర పడటంతో పాటు, బీజేపీ లోని చాలామంది నాయకులతో విభేదాలు ఉండడం, అలాగే బీజేపీ  మిత్రపక్షం గా ఉన్న జనసేన ను కలుపుకు వెళ్లే విషయంలో వీర్రాజు చురుగ్గా వ్యవహరించకపోవడం, ఈ విషయంలో జనసేన వర్గాలలోనూ తీవ్రమైన అసంతృప్తి ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వీర్రాజు స్థానంలో సత్యకుమార్ ను నియమించాలని అధిష్టానం పెద్దలు దాదాపుగా డిసైడ్ అయిపోయారట. ఇక సత్యకుమార్ విషయానికి వస్తే, ఏపీ బీజేపీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో పాటు ఏపీలో వైసిపి ప్రభుత్వంపై సందర్భం వచ్చినప్పుడల్లా సత్య కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఏపీ బీజేపీలో గ్రూపుల గోల తగ్గుతుందనే నిర్ణయానికి బిజెపి అధిష్టానం పెద్దలు రావడంతోనే, సత్య కుమార్ వైపు వారు మొగ్గు చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

వైసీపీని విమర్శలతో ముప్పు తిప్పలు పెట్టడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమైయ్యారు. జనసేనతో దూరంగా ఉండటం కూడా ఆయనకు మైనస్ పాయింట్ అయింది. ఇటీవల.. పార్టీ ని వీడి.. టీడీపీలోని మారిన  బీజేపీ మాజీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.. వీర్రాజు పై విమర్శల బాణాలు వదిలారు. వీర్రాజు వల్లే తాను బీజేపీ ని వీడానని ఆయన అనడం.. వీర్రాజుపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉండటానికి మరో కారణమైంది. అందువల్లే ఏపీ బీజేపీ అధ్యక్ష మార్పు ఆలోచన అనివార్యమైందని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.