కాంగ్రెస్ గాడిన పడదా? కుమ్ములాటలకు ఎండ్ లేదా?

Publish Date:Jul 3, 2023

Advertisement

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేసిన పార్టీ అందులో ఇసుమంతైనా సందేహం లేదు. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఉద్యమ సారథిగా కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ క్రెడిట్ ను తమ ఖాతాలో  వేసుకున్నారు. సోనియా గాంధీ రాజకీయ సంకల్పం వల్లే తెలంగాణ సాకారమైందని చెప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది.

ఫలితం రాష్ట్రం ఇచ్చి కూడా తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరమైంది. దూరం కావడమే కాదు.. రాష్ట్రంలో పార్టీ ఉనికి కూడా నామమాత్రమైంది.  కాంగ్రెస్ టికెట్ పై అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలలో పలువురు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని గులాబి కండువా కప్పుకున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానం  తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి పార్టీ  తెలంగాణ పగ్గాలు అప్పగించింది. ఎవరు ఔనన్నా కాదన్నా.. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జనబాహుల్యంలో కూడా కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగింది. కానీ పార్టీ బలోపేతం కావడం కంటే.. తమ సీనియారిటీని కాదని బయట నుంచి వచ్చి చేరిన రేవంత్ కు పగ్గాలు అప్పగించడాన్ని పార్టీలోని కొందరు పెద్దలు జీర్ణించుకోలేకపోయారు.

వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ వంటి నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే.. రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరారు. సరే అదంతా పక్కన పెడితే అధిష్టానం జోక్యం వల్లనైతేనేమి, కర్నాటక ఫలితాల ప్రభావంతోనైతేనేమి? తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ కాకపోయినా కామా పడిందన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ముఖ్యంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ జన గర్జన సభ సక్సెస్ కోసం విభేదాలు విస్మరించి నాయకులంతా సమష్టిగా కృషి చేశారు. కేసీఆర్ సర్కార్ ఖమ్మంలో రాహుల్ సభను అడ్డుకోవడానికి, ఆ సభకు జనం రాకుండా అవరోధాలు కల్పించడానికీ చేయగలిగినంతా చేసింది.  ఎంత చేసినా సభ విజయవంతమైంది. జనం తండోపతండాలుగా రాహుల్ సభకు హాజరయ్యారు. ఇసుక వేస్తే రాలదన్నంతగా రాహుల్ సభకు జనం పోటెత్తారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఇక తరువాయి అన్నంతగా పార్టీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమైంది. అయితే రాహుల్ సభ సక్సెస్ అయ్యిందన్న ఉత్సాహం  24 గంటలు కూడా గడవకుండానే పార్టీ శ్రేణుల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లుగా భట్టి విక్రమార్క మాట్లాడారు. రేవంత్ కు సీఎం చాన్స్ లేదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నేరుగా రేవంత్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన కాంగ్రెస్ లోనే పుట్టిన వ్యక్తికి తప్ప మరొకరికి సీఎం పదవి దక్కే చాన్స్ లేదన్నారు. అక్కడితో ఆగకుండా టీపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలుపెట్టడానికి అంగీకరించను అని రేవంత్ చెప్పిన మాటలను కూడా  ఖండించారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన వారు కాంగ్రెైస్ లో ఉన్నారనీ, షర్మిల వస్తే తప్పేముందని పరోక్షంగా రాహుల్ మాటలను ఖండించారు.

దీంతో కాంగ్రెస్ లో ఐక్యత కనిపిస్తోందనీ, నేతలంతో ఏకతాటిపైకి వచ్చారనీ సంబరపడుతున్న క్యాడర్ ఉత్సాహంపై భట్టి నీళ్లు చల్లేశారు. కష్టపడి గెలిపించుకున్నా అంతర్గత కుమ్ములాటల కారణంగా ‘చే’ జేతులా అధికారాన్ని వదులుకోవడానికి రాష్ట్ర నాయకత్వం పోటీ పడుతుందని పార్టీ శ్రేణులే బాహాటంగా అంటున్నాయి. నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా అధిష్ఠానం నిరోధించగలిగితేనే.. పార్టికి రాష్ట్రంలో ఏర్పడిన సానుకూల వాతావరణం ఎన్నికల వరకూ ఉంటుందనీ, లేకుంటే ఎగిసిపడిన కెరటంలా మళ్లీ  పార్టీలో నిస్తేజం అలుముకుంటుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.