సిండికేట్లకు సవాల్గా మారిన కొత్త మద్యం పాలసీ
Publish Date:Jul 2, 2012
Advertisement
కొత్తమద్యం విధానంతో లాటరీ ద్వారా మద్యం సిండికేట్లకు గండిపడినా అత్యధిక దుకాణాలు సిండికేట్ల కనుసనల్లోనే ఉన్నాయి. పాత సిండికేట్లతోపాటు లాటరీలో వచ్చిన వారికి కూడా మధ్యం ఈ ఏడాది అమ్మకాలు సవాల్గా మారాయి. ఏడాది గడువులో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుతోపాటు నిబంధనలకు లోబడి మద్యం విక్రయాలు జరపాలి. ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మాత్రమే విక్రయించాలి. అదీ ఎమ్మార్పీరేట్లకే మద్యం విక్రయించాలి. బెల్టు దుకాణాలు పెడితే లైసెన్సులు రద్దు చేస్తారు. షాపుల వద్ద విడిఅమ్మకాలు జరిగినా,అనుమతి లేని గదుల్లో తాగినా కేసులు నమోదు చేస్తారు. 21 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి మద్యం అమ్మకూడదు. ప్రస్తుత విధానం బాగున్నప్పటికి ఏదోవిధంగా అమ్మకాలు పెంచుకోవాలనుకునే సిండికేట్లకు ఈ విధానం మింగుడుపపడం లేదు. నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వానికి ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తే ఆదాయం తగ్గే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఎక్సైజ్ అధికారులు కఠినంగానే వ్యవహరించాలనుకుంటున్నారు. షాపులన్నిటికీ ఈ నెల 1 నుండి 15 వరకు ప్రొవిజినల్ లైసెన్సు వుంటుంది. రుసుము చెల్లింపు, బ్యాంకు గ్యారెంటీలతో పాటు అన్నీ ఒప్పందాలు పూర్తిచేసిన 15 రోజులలో శాశ్వత అనుమతి పత్రాలను జారీ చేస్తారు. అనుమతి కాలం వచ్చే సంవత్సరం జూన్ 30 వరకు ఉంటుంది. లైసెన్సు ఫీజులో ఆరు రెట్లు అమ్మకాలు జరిగిన తర్వాత జరిగే అమ్మకాలపై 8 శాతం ప్రివిలైజ్ రుసుం 5.5 శాతం వ్యాట్ విధిస్తారు. ఇది ఇలా వుండగా మద్యం షాపులపై మహిళలు తిరగబడటంతో షాపు యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/new-liquor-policy-24-15296.html





