Publish Date:Sep 19, 2025
ఫిరాయింపుల మీద తెలంగాణ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన వాదనలు తెర మీదకు వస్తున్నాయ్. ఓట్ల చోరీ కంటే ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద నేరమంటారు కేటీఆర్. ఇదిలా ఉంటే సీఎం రేవంత్.. అసలు ఫిరాయింపు ఎక్కడుంది? ఒక సీఎం అన్నాక.. ఎందరో ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు. ఆ టైంలో వారికి కండువాలు కప్పుతుంటాం. కండువా కప్పుకున్నంత మాత్రాన ఫిరాయింపు కాదని భాష్యం చెబుతారు. అబ్బే తెలంగాణలో ఫిరాయింపులేం లేవంటారాయన.
ఇదే విషయంలో.. కడియం శ్రీహరి మరో చిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చారు. తాను ఏ పార్టీ అన్నది అసెంబ్లీ స్పీకర్ తేలుస్తారు. ఈ విషయంలో తాను చెప్పేదేం లేదంటున్నారు కడియం శ్రీహరి. ఒక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ తేల్చడమేంటి? అంటూ విస్తుపోవడం పరిశీలకుల వంతు అవుతోంది. ఆయన ఏ పార్టీ ద్వారా బీఫాం తీసుకుని పోటీ చేసి గెలిచారో ఆ పార్టీ ఎమ్మెల్యే అవుతారు కదా. మరి కడియం మాట్లలోని వితండం ఎక్కడిది అంటే.. ఇక్కడ మరో విచిత్రమైన పరిస్థితి అదేంటంటే.. ఇదే స్టేషన్ ఘన్ పూర్ సీటు తనకు దక్కాల్సింది పోయి.. శ్రీహరి తన్నుకుపోయారని అంటారు రాజయ్య. టికెట్ ఇవ్వకుంటే తాను కాంగ్రెస్ లోకి వెళ్తానని బెదిరించి మరీ కడియం ఈ టికెట్ బలవంతానా తీసుకున్నారని చెబుతున్నారాయన.
ఇక పోతే ఇదే కడియం.. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అన్న మాట.. ఏంటంటే, ఏదైనా జరగొచ్చు. కాంగ్రెస్ అధికారం వెంటనే కోల్పోవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మా టచ్ లో ఉన్నారంటూ ఫీలర్లు వదిలారు. ఆ వెంటనే వెళ్లి కాంగ్రెస్ లో చేరిపోయారు. అదే మంటే నియోజకర్గం కోసమే ఇదంతా చేస్తున్నానంటారు. కావాలంటే చూడండీ ఇప్పటి వరకూ వెయ్యి కోట్లకు పైగా నిధులు పట్టుకొచ్చానని చెప్పుకుంటున్నారు. ఇటు చూస్తే సీఎం అసలు ఫిరాయింపులే లేవంటున్నారు. అటు చూస్తే అసలు ఓట్ల చోరీకన్నా ఎమ్మెల్యేల చోరీ అతి పెద్దదని కేటీఆర్ అంటారు. ఇక అటు ఇటు కాని సందిగ్దావస్త ఈ ఎమ్మెల్యేలది. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ గద్వాల్ సభ జరిగితే ఎమ్మెల్యే బండ్ల తన ఫ్లెక్సీలకు పరదాలు కప్పుకున్న దృశ్యం కనిపించింది. దీంతో తెలంగాణలో ఫిరాయింపులపై తెలంగాణలో ఎవరికి వారు తమ సొంత భాష్యం చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-definitions-to-defections-39-206517.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!