రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు

Publish Date:Jun 12, 2026

Advertisement

 

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీధర్ నాయక్ (39) ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది. జూన్ 1న తుర్కయాంజల్‌లోని శ్రీరామ్‌నగర్ కాలనీలో తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆయన బలవన్మ రణానికి పాల్పడ్డారు. మృతుడి భార్య సరోజ ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో లోన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయుడు వేధింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకు న్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న శ్రీధర్ నాయక్ మృతికి ముందు జరిగిన పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 

కూతురి కాలేజీ అడ్మిషన్ కోసం పై అధికా రిని అనుమతి కోరిన అనంతరం ఇంటికి వచ్చిన ఆయనకు లోన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు పలు మార్లు ఫోన్ చేశాడని, ఆ తర్వాత కొద్దిసేపటికి తన భర్త గదిలోకి వెళ్ళి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చెప్తుంది.. భార్య సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు శ్రీనివాస్ నాయుడుపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అయితే, ఈ కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు చెందిన సుమారు రూ.33 లక్షల ప్రభుత్వ నిధుల మళ్లింపు వ్యవహారం బయటపడినట్లు సమాచారం. జిల్లా గిరిజన సంక్షేమ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. 

ఆడిట్‌లో ఈ అక్రమాలు బయటపడతా యనే భయంతోనే శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పదేళ్లుగా మూతపడ్డ బ్యాంకు ఖాతాను తిరిగి ప్రారంభించి లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన అధికారులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చెందిన శంషాబాద్, హస్నాపూర్, పీర్జాదిగూడ, భువనగిరి శాఖల నలుగురు మేనేజర్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, శ్రీధర్ బాబు 2012 నుంచి ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో నమ్మకంగా పనిచేస్తున్నారని సహోద్యోగులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ కేసులో వేధింపుల ఆరోపణలు, ఆర్థిక అక్రమాల అనుమానాలు, బ్యాంకు ఖాతాల వ్యవహారం వంటి అన్ని కోణాల్లో పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

By
en-us Political News

  
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.