తిండి లేదు.. తాగడానికి మురికినీళ్లే దిక్కు! వరద బాధితులను వదిలేసిన జగన్ సర్కార్ 

Publish Date:Nov 21, 2021

Advertisement

కుండపోత వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన రాయలసీమలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు తగ్గినా... వరద ముంపు మాత్రం ఇంకా పోలేదు. కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాల్లో దుర్భత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి వరద బాధిత ప్రాంతాల్లోని పరిస్థితి చూస్తే గుండె చెరువైపోతుంది. వరద బారిన పడిన ప్రజలు కట్టుబట్టలతో మిగిలిపోయారు. చివరికి గూడు కూడా మిగలని కుటుంబాలు ఎన్నో. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడక .. పూర్తి సమాచారం బయటకు రావడం లేదు. 

వరద బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. మంచి నీరు దొరక్క మురికినీళ్లతోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే హుటహుటిన స్పందించాల్సిన అధికార యంత్రాంగం జాడ లేకుండా పోయింది.  జరిగేదేదో జరుగుతుందన్నట్లుగా  అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. వరద పరిస్థితిపై మూడు రోజుల ముందుగానే అంచనాలు ఉన్నాప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. విరుచుకుపడిన తర్వాత కూడా అదే పరిస్థితి. అంతా అయిపోయిన తర్వాత కూడా అదే. అధికారుల నిర్లక్ష్యంతో పోయిన ప్రాణాలు పోగా .. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్న వారికి ఆకలిదప్పులు తీర్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 

వరద ప్రాంతాల్లో స్వచ్చంద సంస్థలు చేస్తున్న అరకొర సాయమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి పునరావాస శిబిరాలే అతి తక్కువగా ఉంటే.. అందులోకి తరలించుకు వచ్చిన వారు ఇంకా తక్కువ. వచ్చిన వాళ్లకు కూడా సరిగ్గా ఆహారం అందించడం లేదు. కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. తమ ఆస్తులు పొగొట్టుకున్న రోడ్డున పడ్డ బాధితులు.. ఏం చేయోలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అనేక చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండటం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. 

ప్రభుత్వంలోని పై స్థాయి వాళ్లే పెద్దగా పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ సహాయ చర్యలకు దిక్కు లేకుండా పోయింజి. దీంతో కింది స్థాయి అధికార యంత్రాగం కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వరద వస్తుంది… పోతుంది అన్న పద్దతిలో ఫిక్సయిపోయారు. అలాగే వచ్చింది.. పోయింది.. కానీ తుడిచిపెట్టుకుపోయిన జీవితాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వాల స్పందన వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకూ అఘామేఘాల మీద ప్రజా జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రభుత్వాలను చూశాం కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా.., జరగాల్సింది జరుగుతుందన్నట్లుగా చూసే ప్రభుత్వాలను మాత్రం ప్రజలు ఇప్పుడే చూస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.