కాషాయం కట్టిన ఖద్దర్?.. వామ్మో చినజీయర్‌పై ఇన్ని విమర్శలా?
Publish Date:Feb 11, 2022
Advertisement
చినజీయర్ స్వామి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశం మొత్తంలో పెద్దగా పరిచయం అవసరం లేని ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. నిజానికి అనేక దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, రాజకీయ, సామాజిక రంగాలలోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. అలాగే, ఆయన చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి, వివాదాస్పద రాజకీయ స్వామీజీగా వ్యవహరించారనే ఆరోపణలూ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’కు చిన జీయర్ స్వామితో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మిస్తున్న యాదాద్రి ఆలయ నిర్మాణంలో చిన జీయర్ స్వామి అత్యంత కీలకపాత్రను పోషిస్తున్నారు. అలాగే, కేసీఆర్ నిర్వహించే యజ్ఞయాగాది క్రతువులకు.. చాలా వరకు కర్త, కర్మ, క్రియ చిన జీయర్ స్వామే అంటారు. చిన జీయర్ ప్రోద్బలంతోనే కేసీఆర్ యజ్ఞయాగాదులు నిర్వహిస్తారనీ అంటారు. అందుకే కాబోలు, చిన జీయర్ స్వామి.. సర్కార్ స్వామిగానూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఎదుర్కుంటున్నారు. also read: ఆ రోజుల్లోనే రెబెల్.. శ్రీరామానుజుల జీవిత చరిత్ర ఇదే.. ఇక, వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న యజ్ఞయాగాది క్రతువుల్లో వినియోగిస్తున్న ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇతర విలువైన ఔషధ గుణాలు ఉన్న లక్షల విలువ చేసే ద్రవ్యాలు వృధా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా దుర్వినియోగం కాదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోషకాహారం లేక ప్రతి రోజు ఎందరో అల్లాడిపోతున్న వైనాన్ని హృదయ విదారకరంగా టీవీల్లో (యాడ్స్) చూస్తూనే ఉన్నాం. మరోవంక అదే టీవీల్లో యజ్ఞ యాగాదుల పేరిట నేల పాలు చేస్తున్న పాలు , అగ్నిపాలు అవుతున్న నెయ్యి ఇతర ఎన్నో పోషక విలువలు ఉన్న ద్రవ్యాలు అగ్నిలో కలిసి బూడిదై పోతుంటే, అయ్యో అనిపించడం సహజం. అయితే, ఆ యజ్జాయాగాలు అలానే చేయాలని వేదాలు చెబుతున్నాయి. వాటిని ఆచరించడం మాత్రమే కానీ, మార్చే సాహసం చేయలేరు మరి. ఆ యాగ క్రతువును ఉన్నదిఉన్నట్టు ఫాలో అవుతున్నారు అంతే. అందులో చినజీయర్ను అనటానికి ఏమీ లేదనేది వారి వాదన. ఇక, చిన జీయర్ స్వామి సైతం పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో గొప్ప స్థానంలోనే ఉన్నారు.. చాలామందికి ఆదర్శప్రాయంగానూ నిలుస్తున్నారు. వేర్వేరు ట్రస్టులు, సంస్థల ద్వారా విద్యా, వైద్య రంగాల్లో.. చివరకు పశు వైద్య రంగంలోనూ ప్రముఖ సేవలు అందిస్తున్నారనేది కూడా అంతే వాస్తవం. also read: చినజీయర్ గుజరాత్‌లో ఏం చేశారో తెలుసా? అమిత్‌షా బాల్యంలో ఏం జరిగిందంటే.. ఇక, చిన జీయర్ స్వామి రాజకీయ, వ్యాపార సంబంధాల గురించి కూడా చాలా చాలా విమర్శలున్నాయి. చినజీయర్ తలపెట్టిన శ్రీ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు క్యూకట్టి వస్తున్నరాజకీయ ప్రముఖులను చూసినా.. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి చేస్తున్న ఆశీర్వచన పొగడ్తలను చూసినా, విన్నా.. ఆయన కాషాయం కట్టిన ఖద్దరు స్వామి అన్నా.. అవన్నీ విమర్శలే అయినా, అవి ఆయనకు అతికినట్టు సరిపోతున్నాయని అంటుంటారు. అదేవిధంగా, ముచ్చింతల్ భూమిని (సుమరు 100 ఎకరాలు) ఉచితంగా ఇచ్చిన ప్రముఖ వ్యాపార వేత్త, ‘ మై హోమ్’ రామేశ్వరరావుతో చిన జీయర్ సంబంధాలపై అందరి చూపూ ఉంది. అంత భూమిని రామేశ్వర్ ఉచితంగానే ఇచ్చినా.. ఆ చుట్టూ అంతకుమించి ఉన్న తన భూముల విలువ మరింత పెంచుకునేందుకేననే గుసగుసలూ ఉన్నాయి. ఇక, తమిళనాడులో పుట్టి, పెరిగి, అక్కడే జీవం వదిలిన రామానుజుల విగ్రహం ఆ రాష్ట్రంలో కాకుండా.. శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేయడమూ కాస్త అనుమానాస్పదమే అంటున్నారు. అన్నిటినీ మించి, పెద్ద నోట్ల రద్దు సమయంలో తెలంగాణ ముఖ్య రాజకీయ నాయకునికి సంబందించిన వేల కోట్ల నల్లధనాన్ని చినజీయర్ తెలుపు చేసి తమ ‘సేఫ్’ లాకర్’లో భద్రం చేశారనే ఆరోపణలు.. ఇలా అనేకం ఉన్నాయి. also read: అంతపెద్ద రామానుజ విగ్రహం ఎలా తయారు చేశారో తెలుసా.. ఇక, రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పెద్దలను చినజీయర్ రింగ్ మాస్టర్ లా ఆడిస్తున్న తీరు మరింత ఆసక్తికరం అంటున్నారు. అందుకే .. చినజీయర్ ఆధ్యాత్మిక వ్యక్తేనా.. లేక అంతకు మించిన ఇంకేదైనానా? అనే అనుమానాలు వినవస్తున్నాయి. అసలు విషయం ఆ రామానుజులకే ఎరుక!! also read: ఎవరీ చినజీయర్? పుట్టుక నుంచి స్వామీజీ వరకూ.. ఫుల్ డీటైల్స్
తాజాగా చినజీయర్.. హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వెయ్యి కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆధ్యాత్మిక కేంద్రం, సమతామూర్తి విగ్రహం విషయంలో విభిన్న అభిప్రాయాలు, విమర్శలు వినవస్తున్నాయి. అంత భారీ మొత్తం ఖర్చు చేయడం అవసరమా? అనే వారు కొందరైతే.. అవసరమే అనేవారూ ఉన్నారు. నిజమే, పుట్టపర్తి సాయిబాబా ఒక జిల్లా మొత్తానికి తాగునీరు సదుపాయం కలిపించారు. ఆయనలానే చిన జీయర్ స్వామి కూడా.. వెయ్యి కోట్లు ఖర్చు చేసి సమతామూర్తి విగ్రహం, ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించే బదులు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చు కదా? అనే విమర్శలూ ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/negative-shade-on-chinna-jeeyar-swamy-39-131645.html





