Publish Date:Aug 12, 2022
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. తెలుగు రాష్ట్రాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్న మాటలు.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి రెండు సార్లు మీడియాతో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేకుండా ఉన్నాయని జనం అభిప్రాయపడుతున్నారు.
అలాగే వారి మాటల్లోని తేడాను సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ఏకి పడేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈటెలలాంటి ప్రశ్నలు సంధిస్తూ వైసీపీపి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ లోని ఇద్దరు మహిళా మంత్రులూ కూడా గోరంట్లకు మద్దతుగా మాట్లాడటంతో నెటిజన్లు ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. అయినా జగన్ సర్కార్, వైసీపీ పార్టీ అంతా నాఇష్టం.. ఏం చేసినా అడిగేదెవరు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. అయితే ఇక గోరంట్ల వ్యవహారంలో ఇక ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో కేంద్ర పెద్దలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని హస్తిన నుంచి అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ప్రధానికీ, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూ లేఖలు రాశారు. అక్కడితో ఆగకుండా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కారణంగా ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అందరూ అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన పార్లమెంట్లో ఇటువంటి వ్యక్తులు అడుగు పెట్టడానికి అనర్హులని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గిల్ కోరారని అంటున్నారు.
ఎంపీ గిల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పిందించి, న్యూఢ్ వీడియో కాల్ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాసినట్లు తెలిసింది. అలాగే ఈ వ్యవహారంపై స్వతంత్ర్య దర్యాప్తు జరిపి.. సాధ్యమైనంత త్వరగా మహిళా కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి రేఖా శర్మ లేఖ రాశారు. దీంతో జగన్ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీ అని చూసీ చూడనట్లు ఊరుకుందామనుకున్నా.. ఎదురుదాడితో ఈ వ్యవహారంలో విపక్షాల నోరు నొక్కుద్దామనుకున్నా ఇక వీలయ్యే అవకాశం లేదు. సాంకేతికంగా వీడియో ఒరిజనలా, ఫేకా అని తేల్చడం సాధ్యం కాదంటూ అనంతపురం ఎస్పీతో ప్రభుత్వం చెప్పించినా.. కేంద్రం తలచుకుంటే ఎస్పీ మాటల డొల్ల తనం కూడా వెల్లడైపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం న్యూడ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని నిగ్గు తేల్చాని బావిస్తే వైసీపీ బుకాయింపులకు అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీకి, జగన్ సర్కార్ లో మాధవ్ కు మద్దతుగా మాట్లాడిన వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/national-women-comission-orders-indipendent-probe-into-gorantla-nude-video-issue-39-141797.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.