జగన్ మావిగన్ సవాల్.. రగిలిపోతున్న ధర్మాన.!?

Publish Date:Jul 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ చాలెంజ్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలను డిఫెన్స్ లో పడేసింది. జనాలకు ముఖం ఎలా చూపించాలో తెలియనంతగా ఆత్మరక్షణలో పడ్డారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో ఒకప్పుడు తిరుగులేని నేతగా చక్రం తిప్పిన ధర్మానను జగన్ తీరు మరీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన ధర్మా ప్రసాదరావు జగన్ మావిగన్ చాలెంజ్ పై అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు.  

2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడు.   ప్రజల్లో కూడా ఆయన పట్ల అభిమానం, గౌరవం ఉండేవి. తన వాగ్ధాటితో,  విశ్లేషణలతో ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ, బయటా గళం విప్పి ప్రజామన్ననలు అందుకున్నారు. అయితే అదంతా గతం.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధర్మాన ప్రభ రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ శైలిని, ఏకపక్ష పోకడలను  ధర్మాన ప్రసాదరావు అంతర్గతంగా విభేదించడమేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి.   

ఆ కారణంగానే  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ధర్మానకు అంత సీనియర్ అయి ఉండి కూడా  తొలి మూడేళ్లలో  మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కిందనుకోండి. అది వేరే సంగతి.  

విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు.  ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.  అయినా ధర్మాన ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను వదల లేదు. కానీ ఇప్పుడు జగన్  మావిగన్ అనడం ధర్మానకు మింగుడు పడటం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనతో ధర్మాన పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారనీ,  జగన్ తీరు కారణంగా తన సొంత ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు.

 నాడు విశాఖ రాజధాని అంశంపై గట్టిగా నిలబడిన తాను ఇప్పుడు జగన్ మావిగన్ అనడంతో ప్రజలలో చులకన అయ్యాననీ బాధపడుతున్నారని చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ మావిగన్ నినాదంతో ధర్మాన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మావిగన్ ను బాహాటంగా వ్యతిరేకించాలన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారని అంటున్నారు. 

By
en-us Political News

  
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.