నేషనల్ సైన్స్ డే

Publish Date:Feb 27, 2019

Advertisement


ఫిబ్రవరి 28వ తేదీ మన జాతీయ విజ్ఞాన దినోత్సవం.. నేషనల్ సైన్స్ డే... నా మాత్రుభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను అంటూ చివరి వరకూ భారత దేశంలో సైన్స్ అభివ్రుద్దికి పాటుపడ్డ మహనీయుడు చంద్రశేఖర్ వెంకట్రామన్ సి.వి.రామన్ గారి పరిశోధనా ఫలితాల్ని ధ్రువీకరించిన  రోజు ఫిబ్రవరి 28 కనక ఈరోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సి.వి.రామన్ గారికి వందనాలు అర్పిస్తూ..ఒక్కసారి ఆయన గురించి మన దేశ శాస్త్రవేత్తల గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.

 

1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించారు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు. సి.వి.రామన్ గారి గురించి తలుచుకున్నాం కద...


జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా మన భారతదేశంలో మిగిలిన ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు కూడా ఒక్కసారి తలుచుకుందాం....

 

శ్రీనివాస రామానుజన్ గారు..

శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు. 20 వ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు. శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు. మరో ప్రసిద్ధ విద్యావేత్త,రసాయన శాస్త్రవేత్త,ఉపాధ్యాయుడు అయిన ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదటి భారతీయ ఔషధ సంస్థ,బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటు చేసారు. భారతీయ రసాయన శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్తగా అయన చాలా ప్రసిద్ధి చెందారు. అంతేకాక కెమిస్ట్రీ రాయల్ సొసైటీ వారిచే జీవిత పురస్కారాన్ని పొందారు. మొట్ట మొదటగా యూరోప్ బయట నుండి ఒక రసాయన ల్యాండ్ మార్క్ ప్లాక్ గా గుర్తింపు పొందారు.
  

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు..

కర్నాటక చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య,మైసూర్ లో కావేరి నదిపై కృష్ణ రాజ సాగర్ ఆనకట్టను నిర్మించిన ఒక ఇంజనీరు. ఆయన గౌరవార్ధం, భారతదేశం ప్రతి సంవత్సరం అయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 న ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నారు. ఆయన ప్రజా మరియు ఆధునిక నిర్మాణ భారతదేశం గురించి చేసిన వివిధ రచనలకు 1955 వ సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది.


మరో భౌతిక శాస్త్రవేత్త  హోమీ జహంగీర్ భాభా..

హోమీ భాభా ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు ఒక ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ మరియు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించడంలో ప్రముఖమైన పాత్రను పోషించారు. అయన భారతీయ అణు శక్తి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు. అయన భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉన్నారు.

 

మరో మహానుభావుడు జగదీష్ చంద్ర బోస్ గారు..

బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త,జీవశాస్త్రజ్ఞుడు,వృక్షశాస్త్రజ్ఞుడు మరియు పురాతత్వవేత్త అయిన JC బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ రంగంలో వివిధ అధ్యయనాలను కనుగొన్నారు. అయన జంతువులు మరియు మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి 'క్రెస్కోగ్రాఫ్' అనే పరికరాన్ని కనుగొన్నారు.


  
మనమంతా సలాం చేయాల్సిన మరో మహానుభావులు సలీం ఆలీ గారు...

సలీం ఆలీ పక్షుల అధ్యయనం మరియు వాటిని వర్గీకరించడంలో అపారమైన ఆసక్తి కలిగిన ఒక భారతీయ పక్షి శాస్త్రవేత్త .ఆయన భారతదేశం అంతటా క్రమబద్ధమైన పక్షి సర్వేలు నిర్వహించిన మొదటి భారతీయుడు. అలాగే అయన అన్ని సమయాల్లోనూ విస్తృతంగా గొప్ప శాస్త్రవేత్తగా ఆమోదించబడ్డారు. అంతేకాక సలీం ఆలీని "భారతదేశం యొక్క బర్డ్ మెన్ " గా పిలిచేవారు.

 

కంప్యూటర్ సైన్స్ లో వండర్స్ స్రుష్టిస్తాను బిరెడీ...అన్న మహానుభావులు రాజ్ రెడ్డి గారు...

రాజ్ రెడ్డి కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ రంగంలో పెద్ద స్థాయిలో మార్గదర్శకులుగా ఉన్నారు. అయన కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ కనుకోనుట వలన,1994 వ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన అలన్ ట్యూరింగ్ అవార్డు ను గెలుచుకున్నారు.

 

మన భారతదేశానికి ఆయన పేరే తెచ్చింది విజానబలం.. ఆయన వేరెవరో కాదు... A.P.J. అబ్దుల్ కలాం....

అందరం పెడదాం...ఆయనకి సలాం... APJ అబ్దుల్ కలాంను భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ అని అంటారు. అయన విస్తృతంగా భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి మరియు అణు యుద్ధ క్షిపణి కార్యక్రమం అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. భారతదేశంలో ఉత్తమ రాష్ట్రపతులలో ఒకరిగా చేశారు.

 

మరో మహానుభావులు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్..

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ భారత ఖగోళభౌతిక శాస్త్రవేత్తగా పేరు గాంచారు. అయన నక్షత్రాలు మరియు బ్లాక్ హోల్స్ యొక్క పరిణామ దశలను కనుగొనుట వలన 1983 వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అయన కనుగొన్న సిద్దాంతం 'చంద్రశేఖర లిమిట్' గా పేరు పొందింది.

ఇలా ఎందరో మన భారతీయ శాస్త్రవేత్తలు అందరికీ... తలవంచి మరీ దాసోహం చేద్దాం.... ఎందుకంటే ఇవాళ సమాజంలో మనకి అవసరమైన శాస్త్రసాంకేతిక పరికరాలు, వైద్యసదుపాయాలు అన్నీ మనకి ఉన్నాయంటే ఇదంతా వారి చలువ... అందుకే మనమంతా వారందరికీ ఒకసారి... వందనాలు చేసుకుందాం...

 

By
en-us Political News

  
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.