దేశానికి మరో చండ శేషణుడు కావాలి!

Publish Date:Aug 11, 2023

Advertisement

ఏ అధికారిని చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ తప్ప అనే భావన ప్రజల్లో ఉంది. అలా ఎవరి చేతుల్లో కీలుబొమ్మ కాకుండా.. ప్రభుత్వాలను, ప్రధాన రాజకీయ పార్టీలను గడగడలాడించి.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా నిలిచిన వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, దివంగత టీఎన్‌ శేషన్. పదవీకాలం ముగిసి ఏళ్ళు గడిచినా, ఆయన ఈ లోకాన్ని విడిచినా.. ఇప్పటికీ ఆయనను తలచుకుంటున్నాం అంటే అది ఆయన గొప్పతనం. సుప్రీం కోర్టు సైతం ఆయనను స్మరించుకుంటున్నది.

ఇంతకీ ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. దేశ ప్రజాస్వామ్య సౌథాన్నే కూల్చేసేంత దుర్మార్గమైన బిల్లును కేంద్రం గురువారం (ఆగస్టు 10) రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. ఆ బిల్లు ఇప్పటికే గాలిలో దీపంగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని పూర్తిగా నాశనం చేసేదిగా ఉంది.  ఆ బిల్లు చూసిన ఎవరికైనా ఇప్పుడు శేషన్  ఉండి ఉంటేనా అనిపించకమానదు.. వివరాల్లోకి వెడితే కేంద్రం తీసుకువచ్చిన బిల్లుతో..విపక్షాల భయాలే నిజమౌతున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని మోడీ సర్కార్ గుప్పెట్లో పెట్టుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అయిపోయింది. ఇందు కోసం సుప్రీం కోర్టు  తీర్పునకు భిన్నంగా బిల్లు రెడీ చేసింది. గురువారం (ఆగస్టు 10) రాజ్యసభలో ప్రవేశ పెట్టేసింది కూడా. ఈ బిల్లు ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం పట్టును, జోక్యాన్ని పెంచేదిగా ఉంది. ఎంపిక కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేసే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టింది.

ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ పంజరంలో చిలుకలా కేంద్రం చేతిలో  కీలుబొమ్మలా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లు కనుక సభ ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అంటే 2019 ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవీఎంల నుంచి ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసుల వరకూ అన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని విపక్షాలు ఆరోపించాయి.

ఆ తరువాత కూడా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ప్రతి అంశమూ కూడా మోడీ కనుసన్నలలో జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. మొత్తంగా కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని లాగేసుకుని తానే ఆధిపత్యం చెలాయించాలని  చూస్తున్నదన్న విపక్షాల ఆరోపణలు అక్షర సత్యాలేననడానికి కేంద్రం తాజాగా లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లు రుజువు చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2012లోనే బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వాని అప్పటి ప్రధానికి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి  చోటు కల్పించాలని కోరుతూ లేఖ రాశారు. ఇక ఈ ఏడాది మార్చిలో దేశ సర్వోన్నత న్యాయస్థానం  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకంపై విస్ఫష్ట తీర్పు ఇచ్చింది.

ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ నియామకాలు జరపాలని స్పష్టంగా పేర్కొంది. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం గురువారం(ఆగస్టు 10) రాజ్యసభలో  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా ఆ స్థానంలో ప్రధాని ఎంపిక చేసే కేంద్ర మంత్రికి స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లును  ప్రవేశపెట్టింది. ఈ బిల్లు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక కమిటీలో  ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, ప్రధాని ఎంపిక చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ  ఎన్నికల కమిషనర్లుగా నియమించేందుకు అర్హత ఉన్న ఐదుగురిని ఎంపిక చేస్తుంది. వారిలో నుంచి ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సీఈసీ, కమిషనర్లను ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. అదీ సంగతి. 

ఇప్పటికే కేంద్రం ఆడించినట్లే కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటి  దాడులు ఏ లక్ష్యంతో ఎవరిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నాయో అందరికీ తెలుసుననీ, ఇప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయనీ, ఇక ఈ బిల్లు ప్రవేశ పెట్టడంతో కేంద్రం అవన్నీ ఆరోపణలు కావు, అక్షర సత్యాలని తేల్చేసిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సర్వ వ్యవస్థలపైనా పెత్తనం చెలాయించి అధికారాన్ని శాశ్వతం చేసుకునే కుట్రలో భాగమే ఈ బిల్లు అని కాంగ్రెస్ విమర్శించింది.

అయితే న్యాయ నిపుణులు మాత్రం ఇది న్యాయపరీక్షకు నిలబడదని అంటున్నారు. మొత్తం మీద కేంద్రం తీసుకువచ్చిన బిల్లు మాత్రం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించేలా మోడీ సర్కార్ చట్టాలను రూపొందిస్తోందనీ, మంద బలంతో వాటిని సభలో ఆమోదింప చేసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.