Publish Date:Aug 11, 2023
మొన్నటి భారత్ జోడో యాత్ర.. నిన్నటి కర్ణాటక గెలుపు.. మొత్తం మీద యమ బోరుగా ఉన్న కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణను టార్గెట్ చేసింది.
ఈ సమయంలో చేరికలతో, సరికొత్త ఎత్తులతో సందడి చేస్తోంది. ఈ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎంటరయ్యాడు. అసెంబ్లీకి పోటీ చేసి..ఎమ్మెల్యే అయ్యేందుకు తహ తహ లాడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికలల్లో చక్కని ఇన్నింగ్స్ కోసం కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో ఒక నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నాడాయన. దీంతో స్థానిక నేత అనుచరులు ఆందోళనలకు దిగి తున్నారు.
పార్లమెంట్ సభ్యునుగా అజారుద్దీన్ 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతగా అసెంబ్లీకి ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా... జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తనకు తానుగా ప్రకటించుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి వెళ్లిన అజారుద్దీన్ కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి వెళ్లిన ఆయన... నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనే వివాదానికి కారణమైంది.
దీంతో... పీ.జనార్థన రెడ్డి తనయుడయ.. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి మద్దతుదారుల నుంచి నిరసన వ్యక్తం అయింది. జూబ్లీహిల్స్ తో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. ఫలితంగా... విష్ణు మద్దతు దారులు అజాహరుద్దీన్ పర్యటనకు అభ్యంతరం చెప్పారు. పైగా... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై జూబ్లిహిల్స్ నుంచి పోటీచేసి గెలవాలని విష్ణువర్దన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ పెద్దలతో మంతనాలు జరిపారని అంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో గతకొంతకాలంగా చురుకుగా ఉన్నారు.
సరిగ్గా ఈ సమయంలో అజారుద్దీన్ ఎంటరయ్యారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని సోమాజీ గూడ, ఎర్రగడ్డ, బోరుబండ ప్రాంతాల్లో పర్యటించారు. పార్టీ కేడర్ తో కలిసి ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులతోనూ మమేకమయ్యే ప్రయత్నం చేసారు. దీంతో విష్ణు వర్గీయులు అజార్దుద్దీన్ పై ఫైరవుతున్నారు. అయితే.. అజాహరుద్దీన్ ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపాలని మరి కొందరు నేతలు సూచిస్తున్నారు. విష్ణు అనుచరులు మాత్రం ఏంటి పరిస్థితి అంటూ తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ సమయంలో అధిష్టానం పెద్దలు అజారుద్దీన్ ని ఒప్పిస్తారా.. లేక, విష్ణుని పక్కన పెడతారా..అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అవుతోందా..?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/azaruddin-eye-on-mla-post-39-159808.html
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.