పారిపోయింది ప్రభుత్వమా, వైసీపీనా?
Publish Date:Aug 17, 2026
Advertisement
ఏపీ అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టారు. మెగా డిఎస్సీ నిర్వహణ, ఫలితాలపై వైసిపి చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన అసెంబ్లీలో, మండలిలో ఆధారాలతో సహా ఖండించారు. ప్రభుత్వం పారదర్శకంగా రికార్డు స్థాయిలో 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని విద్యాశాఖ మంత్రి విస్పంష్టంగా తేల్చి చెప్పారు. లోకేష్ సభ సాక్షిగా ఇచ్చిన వివరణతో వైసీపీకి బుల్లెట్ దిగిందా అన్నట్లుగా రిప్లై ఇచ్చారు. లోకేష్ వైసీపీకి ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అక్కడ, అలా ఇచ్చేశారని విశ్లేషించారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ అనలిస్టు డీవీ శ్రీనివాస్. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన డీవీ శ్రీనివాస్.. లోకేష్ సమావేశంతో జగన్ చెబుతున్నట్లు ప్రభుత్వం పారిపోలేదనీ జగనే పారిపోతున్నారని తేటతెల్లమైందని అన్నారు. సరిపోదా జగన్ సరిపోదా లోకేష్ రిప్లై అని ప్రశ్నించారు. లోకేష్ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారన్న ఆయన.. ఇప్పటికి మూడు సార్లు చర్చకు రావాలని చేసిన లోకేష్... ఇప్పుడు నాలుగో సారి సవాల్ చేశారన్న డీవీ శ్రీనివాస్.. సభకు రాకుండా వైసీపీ పారిపోయిందనడానికి ఆ పార్టీ సభ్యులు సభకు రాకపోవడమే నిదర్శనమన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు. డీవీ శ్రీనివాస్ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించండి. Nara Lokesh AP Assembly Speech, Mega DSC Results Andhra Pradesh, Nara Lokesh Counter To YCP, AP Teacher Recruitment News, Mega DSC Latest News Telugu
http://www.teluguone.com/news/content/nara-lokesh-ap-assembly-speech-39-229113.html





