ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్..!

Publish Date:Sep 8, 2026

Advertisement

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!

 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. 

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు.

మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది. 

ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

 

 

 

(BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)

By
en-us Political News

  
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.