'చినబాబు చిరుతిండి 25 లక్షలండి'.. సాక్షిపై 75 కోట్ల‌కు లోకేశ్ ప‌రువున‌ష్టం దావాఅండి!

Publish Date:Feb 24, 2022

Advertisement

స‌రే.. ఏదో చిరుతిండి తిన్నారే అనుకోండి.. అందుకు ఎంత ఖ‌ర్చు అవుతుంది? ఎక్కువ‌లో ఎక్కువ ఏ వందో.. వెయ్యో. అంతేగా.. కానీ, ఏకంగా 25 ల‌క్ష‌ల చిరుతిండి ఎవ‌రైనా తింటారా?  నారా లోకేశ్ తిన్నాడంటూ సాక్షి పేప‌ర్లో అప్ప‌ట్లో ఓ న్యూస్ వ‌చ్చింది. అదంతా వండివార్చిన స్టోరీన‌ని అంద‌రికీ తెలిసిందే. ఆ పేప‌ర్లో వ‌చ్చిన తేదీల్లో.. లోకేశ్ అస‌లు అక్క‌డ లేనే లేరు. అయినా.. నోటికొచ్చిన తేదీల‌తో.. నోటికొచ్చినట్టు.. చిరుతిండికి 25 ల‌క్ష‌లంటూ సొల్లు స్టోరీ సాక్షి పేప‌ర్లో వేయ‌డంతో లోకేశ్‌కు మండింది. ఇదేంటి.. త‌న‌పై ఇంత చీప్‌గా క‌థ‌నం వేయ‌డ‌మేంట‌ని సాక్షి సంగ‌తి తేల్చే ప‌నిలో ప‌డ్డారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్యద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌. 

‘సాక్షి’ తెలుగు దినపత్రికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ  లోకేష్ 75 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి విశాఖ కోర్టుకు స్వయంగా ఆయన గురువారం హాజరయ్యారు. సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు ప్రచురించిందని లోకేష్ ఈ దావా దాఖలు చేశారు. ఒరిజినల్ సూట్ 6/2020 నెంబరుతో దాఖలైన వ్యాజ్యంలో తన వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే దురుద్దేశంతో సాక్షి పత్రికలో తప్పుడు కథనం ప్రచురించారని పిటిషన్ లో లోకేష్ పేర్కొన్నారు.

`చినబాబు చిరుతిండి 25 లక్షలండి` శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షిపత్రికలో కథనం ప్రచురించారు. ఆ కథనం పూర్తిగా దురుద్దేశపూర్వకంగా ప్రచురించినదేనని, దాంట్లో ఉదహరించిన బిల్లులు, తేదీలతో సహా అంతా తప్పుడు సమాచారమేనని లోకేష్ పేర్కొన్నారు. ఆ కథనంలో ప్రచురితమైన అంశాలన్నీ పూర్తిగా అవాస్తవాలేనని, దురుద్దేశపూర్వకంగా రాసిన తప్పుడు కథనం అని ఖండిస్తూ 2019 అక్టోబర్ 25న సాక్షి సంపాదక బృందానికి నారా లోకేష్ తరఫున న్యాయవాదులు రిజిస్టర్ నోటీసు పంపించారు. దీనికి సంబంధించి 2019 నవంబర్ 10న సాక్షి నుంచి తిరుగు సమాధానం వచ్చింది. దీనిపై సంతృప్తి చెందని నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు.

తన పరువుకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన తన పరువు ప్రతిష్టలు మంటకలిపేందుకు తనకు సంబంధంలేని అంశాలతో ముడిపెట్టి అసత్యకథనం రాసి ప్రచురించిన కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యానని అందులో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, సాక్షి ప్రచురణకర్త, సంపాదకుడు వర్ధెల్లి మురళి, విశాఖపట్నానికి  చెందిన సాక్షి న్యూస్ రిపోర్టర్లు బి. వెంకటరెడ్డి, గరికపాటి ఉమాకాంత్ లపై రూ. 75 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు.

నిజానికి ఆ పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను అసలు విశాఖలోనే లేనని నారా లోకేష్ గతంలోనే ఖండించారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తన ఖర్చు అంటూ అసత్యాలు సాక్షిలో ప్రచురించారని లోకేష్ ఫైరయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ ఖర్చులు తనకు అంటగడుతూ సత్యదూరమైన కథనాన్ని సాక్షి వండి వార్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లే ప్రముఖులతో పాటు.. ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు పర్యటనలకు వెళ్లిన సందర్భంగా ప్రోటోకాల్ పాటిస్తారని సాక్షి పత్రికకు తెలియకపోవడం శోచనీయం అన్నారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదన్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా సీఐఐ, అగ్రిటెక్, ఫిన్ టెక్ వంటి భారీ సదస్సులు జరిగాయని, వాటి కోసం దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారని తెలిపారు. ప్రఖ్యాత ఐటీ కంపెనీల ప్రారంభోత్సవాలు, అదానీ బిగ్ డేటా పార్క్ వంటి వాటికి శంకుస్థాపనలు కూడా జరిగాయని లోకేష్ గుర్తు చేశారు. ఆయా సందర్భాల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు అత్యంత ముఖ్యమైన ప్రముఖులకు కల్పించిన ప్రభుత్వ ప్రోటోకాల్ మర్యాదలూ తప్పేనని సాక్షి కథనం ఉద్దేశమా అని ఆయన ప్రశ్నించారు. వేలకోట్లు పెట్టుబడులు తెచ్చే ఇలాంటి  సదస్సులు ఇప్పుడు నిర్వహించడం లేదని, వైసీపీ సర్కార్ చిల్లర చర్యల వల్లే ప్రఖ్యాత కంపెనీల రావడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం హోదాలో సాక్షి యజమాని జగన్ కోర్టుకు హాజరైతే ఒక్కరోజు ఖర్చు రూ.60 లక్షలని కోర్టులో న్యాయమూర్తికి విన్నవించారు కదా? మరి అప్పటి సీఎం చంద్రబాబు ఆయన మంత్రివర్గం, ఉన్నతాధికారుల ప్రోటో కాల్ ఐదేళ్లకు 25 లక్షలంటే.. ఆశ్చర్యపోతూ.. అదేదో తానే విమానాశ్రయంలో కూర్చుని తినేశానన్నట్టు రాయడమేనా సాక్షి మీడియా విశ్వసనీయత అని లోకేష్ ప్రశ్నించారు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.