మల్లాది ఆవేశానికి కారణాలు ఏమిటో?
Publish Date:Mar 30, 2012
Advertisement
నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, తన సహచర శాసనసభ్యుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన మల్లాది విష్ణుపై పోలీసు కేసు నమోదు చేయడం కృష్ణాజిల్లాలో పెద్దచర్చనీయాంశంగా మారింది. ఒక శాసన సభ్యునిపై మరొక శాసన సభ్యుడు పోలీసు కేసు పెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం కావడమే కాకుండా ఇరువురు కృష్ణాజిల్లాకు చెందినవారే కావడం విశేషం. గృహనిర్మాణ శాఖకు సంబంధించి హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో తనపైకి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ తంగిరాల ప్రభాకరరావు పోలీసు కేసు పెట్టారు. అయితే సమావేశంలో శాసనసభ్యుడు విష్ణు ఆవేశపడటానికి, ప్రభాకర్ పోలీసు కేసు పెట్టడం వెనుక ఇతరత్రా అంశాలు వున్నాయని, గృహ నిర్మాణ సమావేశం ఒక సాకు మాత్రమేనని జిల్లాకు చెందిన ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో వున్న 16 స్థానాలకుగాను మెజారిటీ స్థానాల్లో అంతే జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గుడివాడ, కైకలూరు, నూజివీడు, గన్నవరం, అవనిగడ్డ (8)లలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించగా, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల నుంచి పి ఆర్ పి, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మచిలీపట్నం, పెడన, పామర్రు, పెనమలూరులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల పి ఆర్ పి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన నేపథ్యంలో కృష్ణాజిల్లా అధికార, ప్రతిపక్ష సభ్యుల సంఖ్యంగా చేరిసమం అయ్యింది. సభ్యుల సంఖ్య చేరిసమం అయినప్పటికీ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, మైలవరం శాసనసభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావుకు అధికార పార్టీ శాసనసభ్యుల కంటే ఎక్కువగా గుర్తింపు వుంది. దేవినేనికి నందిగామ శాసన సభ్యుడైన తంగిరాల ప్రభాకరరావు, అత్యంత సన్నిహితులు. జిల్లాలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా తంగిరాల, దేవినేనితో కలిసి పాల్గొనడమే కాకుండా అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులను విమర్శించడంలో, వారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటంలో ముందుంటారు. కృష్ణాజిల్లాలో ఒక విధంగా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్ లతోపాటు మంత్రి కె.పార్థసారధి ఒక జట్టుగా వ్యవహరిస్తుండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల ప్రభాకరరావు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్యలు ఒక జట్టుగా వ్యవహరిస్తూ ఏ చిన్న అవకాశం వచ్చినా పరస్పరం ఒకరిపై మరొకరు మాటలతో దాడి చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తెలుగుదేశంపార్టీకి చెందిన నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య ప్రసంగంతో సమావేశంలో రగడ ప్రారంభమైనా అది చివరకు పార్టీల మధ్య, ఆ తర్వాత వ్యక్తుల మధ్య రగడగా మారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
http://www.teluguone.com/news/content/nandigam-central-minister-tangirala-prabhakara-rao-24-13021.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





