Publish Date:Apr 10, 2026
ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఒక క్రీడ కాదు. ఒక మతం. క్రికెటర్లను అభిమానులు దేవుడితో సమానంగా కొలుస్తారు. తమ అభిమాన క్రికెటర్ కోసం చేసే పనులు ఆశ్చర్యానందాలను కలిగించడం కద్దు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక జంట తమ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఉన్న మక్కువను వినూత్నచాటారు. తమకు పుట్టిన కుమారుడికి వారు విరాట్ నామకరణం చేశారు. తమ అభిమానాన్ని వారు చాటుకున్న తీరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఆ జంట వినూత్నంగా నిర్వహించింది. ఈ వేడుకను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు థీమ్ తో నిర్వహించిన ఆ జంట.. ఒక చిన్న ఆర్సీబీ జెర్సీని ప్రదర్శించారు. ఆ జెర్సీ వెనుక నంబర్ 18, విరాట్ అని పేరు ముద్రించారు. తద్వారా వారు తమ కుమారుడికి విరాట్ అన్న పేరు పెట్టినట్లు చాటారు. ఈ విడియో ప్రస్తుతం నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ విషయాన్ని అందరికీ వెల్లడించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు యమా రంజుగా సాగుతున్న తరుణంలో ఈ జంట తమ కుమారుడికి నామకరణం చేసిన తీరు, ఆ జంటకు విరాట్ కోహ్లీ పట్ల ఉన్న అభిమానం క్రికెట్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ జంట సృజనాత్మకపై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/naming-ceremony-with-rcb-36-217071.html
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.