అత్యంత రహస్యంగా ఇరాన్ అణ్వాయుధ పరీక్ష.. పశ్చిమాసియాలో శాంతి ఎండమావేనా?

Publish Date:Apr 10, 2026

Advertisement

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలూ, మరో వైపు దాడుల హెచ్చరికల మధ్య ఉద్రిక్తతలు సునామీ కెరటాల్లా ఎగసిపడుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే  ఇరాన్ అత్యంత రహస్యంగా   అణ్వాయుధ పరీక్షను విజయవంతంగా నిర్వహించిందన్న వార్త ప్రపంచాన్ని వణికించేస్తున్నది.  రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, ఆ దేశ మాజీ ప్రధాని దిమిత్రీ మెద్వెదేవ్ ఇరాన్ అణు పరీక్ష నిర్వహించిందన్న సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ఆయన వెల్లడించిన ఈ రహస్య వాస్తవమే.. ప్రపంచాన్ని నిలువెల్లా ఆందోళేనలో ముంచేసింది. అంతర్జాతీయ దౌత్యవర్గాలలో కలకలం రేపుతోంది.  

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు   సన్నిహితుడిగా పేరున్న మెద్వెదేవ్,  సోషల్ మీడియా వేదికగా ఇరాణ్ అణ్వస్త్ర ఆయుధ సామర్ధ్యాన్ని పరీక్షించుకొందనీ, ఇందుకోసం ఆ దేశం చేసిన రహస్య ప్రయోగం సక్సెస్ అయ్యిందనీ పేర్కొన్నారు.    అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత గంటల వ్యవధిలో రష్యా మాజీ ప్రధాని  మెద్వెదేవ్ ఇరాన్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిందన్న బాంబు లాంటి వార్తను వెల్లడించారు.  ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో  ఇరాన్ అణ్వాయుధ పరీక్ష నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 

గత కొంతకాలంగా ఇరాన్ తన యురేనియం శుద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెబుతూనే ఉంది.  అదే సమయంలో ఇరాన్ కూడా యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతోందని చెబుతూనే.. తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుత అవసరాల కోసమేనని నమ్మబలుకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మెద్వెదేవ్  వ్యాఖ్యలు వాస్తవమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  రష్యాకు ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. మెద్వెదేవ్ వ్యాఖ్యలు విశ్వసించాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. ఇరాన్ అణు సామర్థ్యం నిస్సందేహంగా ఇజ్రాయెల్ వంటి దేశాలకు పెను ముప్పు. అయితే మొద్వదేవ్ వ్యాఖ్యలను అమెరికా కానీ, ఇరాన్ కానీ ఇప్పటి వరకూ ఖండించలేదు. సమర్ధించలేదు. కానీ  మెద్వెదేవ్ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో శాంతి ఎండమావేనా అన్న సందేహాలను కలిగిస్తున్నాయి.

By
en-us Political News

  
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.