నాగబాబు వాచాలత.. వాతావరణాన్ని చెడగొడుతోందా?

Publish Date:May 10, 2023

Advertisement

మెగా బ్రదర్ నాగబాబు.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఆయనకే అర్ధం కానట్లుంటుంది ఆయన తీరు. చాలా సార్లు ఆయన వ్యాఖ్యలు, మాటలు వివాదాలకు తావిచ్చేవిగానే ఉంటాయి. నటుడిగా, టీవీలలో  జబర్దస్త వంటి షోలకు జడ్జిగా ఆయన పాత్రను ఆయన బాగానే పోషించారు. అయితే రాజకీయాలలో మాత్రం ఆయన తప్పుటడుగులు వేస్తున్నారు. వాచాలత కారణంగా ఆయన సొంత పార్టీకే నష్టం చేకూరుస్తున్నారు.

ప్రజారాజ్యంలో ఉన్నంత కాలం ఆయన ఏం మాట్లాడారు, ఏం చేశారు అన్నది పక్కన పెడితే.. చాలా కాలం తరువాత యిప్పుడు జనసేన పార్టీలో కీ రోల్ పోషిస్తున్న సమయంలో  ఏదైనా మాట్లాడే ముందు ఒకింత వెనకా ముందూ ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఆ పని నాగబాబుకు తెలియదన్న సంగతి ఆయనకు తప్ప అందరికీ తెలుసు. యింతకీ ఈ ఉపోద్ఘాతమెందుకంటే.. ఆయన తాజాగా జనసేన ఓట్ల శాతం గురించి ప్రకటన చేసి వివాదాల తుట్టె కదిపారు. జనసేనకు 35శాతం ఓట్లు ఉన్నాయని ఊరుకుంటే బాగానే ఉండేది. కానీ నాగబాబుకు ఎక్కడ ఆపాలో తెలియదు. అందుకే ఆయన పవన్ కల్యాణ్ సీఎం అవుతారంటూ చేసిన ప్రకటన జనసేన వర్గాలలోనే  భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణమైంది.

జనసేన ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని సోదరుడు నాగబాబు వ్యాఖ్యలు జనసేన రాజకీయ లక్ష్యానికీ, ఆదర్శానికీ భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అంటూ పదే పదే చెబుతూ.. తెలుగుదేశంతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు యిస్తున్నారు. అలాగే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తుందన్న సంకేతాలు యిస్తున్నారు. ఈ సంకేతాల కారణంగానే క్షేత్ర స్థాయిలో జనసైనికులు తెలుగుదేశం శ్రేణులతో కలిసి పని చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్రలో కూడా జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. అయితే తెలుగుదేశం- జనసేన మధ్య పొత్తు వ్యవహారం అధికారికంగా ఖరారు అయిన దాఖలాలు లేవు.

అందుకు అవసరమైన సానుకూల వాతావరణం అయితే ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆ సానుకూల వాతావరణాన్ని దెబ్బ కొట్టే విధంగా పవన్ కల్యాణ్ సీఎం అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పొత్తు లేకుండా జనసేన ఒక వేళ ఒంటరిగా రంగంలోకి దిగితే.. అప్పుడు నాగబాబు ఆ మాటలు అన్నా అర్ధం ఉండేది. కానీ పార్టీ అధినేత, పార్టీలో నంబర్ 2గా గుర్తింపు పొందిన నాయకుడు కూడా పోత్తులకు అనుకూలం అంటూ సంకేతాలు యిస్తుంటే.. నాగ బాబు మాత్రం ఆలూ లేదు చూలు లేదన్నట్లుగా ముఖ్యమంత్రి పవన్ అంటూ ప్రకటన చేయడంపై జనసేన శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమౌతున్నది.

పవన్ సోదరుడు అన్న గుర్తింపు వినా జనసేనలో కానీ, రాజకీయంగా కానీ నాగబాబుకు ప్రత్యేక గుర్తింపు అన్నది లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మెగా బ్రదర్ కార్డుతో పొందుతున్న గౌరవాన్ని నిలుపుకోవాలంటే యిలాంటి తొందరపాటు ప్రకటనలు కూడదని సూచిస్తున్నారు.  ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న దానిపై యిప్పటికింకా సందిగ్ధతే నెలకొని ఉంది. అయితే ఒక జనరల్ ఫీలింగ్ మాత్రం బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా.. తెలుగుదేశం, జనసేనలు కలిసే సాగుతాయన్న సంకేతాలైతే స్పష్టంగా ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తెలుగుదేశంతో పొత్తు కుదిరితే.. జనసేన ఆ పార్టీతో సీట్లు పంచుకోవలసి ఉంటుంది. తెలుగుదేశం కచ్చితంగా అధిక స్ధానాలలో పోటీకి దిగుతుంది. అ విషయాన్ని జనసేనాని పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గౌరవానికి భంగం కలగని రీతిలో  పొత్తులు ఉంటాయనడం ద్వారా.. కొన్ని స్థానాలకు తమ పార్టీ పరిమితమౌతుందని ఆయన చెప్పకనే చెప్పేశారు. మరి అలాంటప్పుడు ఎక్కువ స్థానాలలో పోటీచేసే తెలుగుదేశం జనసేనకు సీఎం పదవి యివ్వడానికి అంగీకరిస్తుందా?  యిప్పటికిప్పుడు అయితే రాజకీయ అవసరాల దృష్ట్యా యిరు పార్టీలూ పరస్పర సహకారం గురించి మాట్లాడుకుంటున్నా.. గత అనుభవం దృష్ట్యా చూస్తే.. పొత్తు తెలుగుదేశం పార్టీకి కంటే జనసేన పార్టీకే ఎక్కు వ అవసరం.

ఆ సంగతిని విస్మరించి పవన్ సీఎం అంటూ నాగబాబు ప్రకటనలు గుప్పించడం జనసేనకు ప్రయోజనం సంగతి పక్కన పెడితే నష్టం చేసే అవకాశాలే ఎక్కువ.   ఆయన వ్యాఖ్యలు క్షేత్ర స్థాయిలో జనసేన శ్రేణులను అయోమయానికి గురి చేయడం తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా.. వైసీపీకి తెలుగుదేశం.. జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీకి ఆయాచితంగా ఓ అస్త్రం అందించినట్లైందని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.