Publish Date:Aug 17, 2026
జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ.. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ సోమవారం (ఆగస్టు 17) ఉత్తర్వులు ారీ చేసింది.
రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ సమతుల్యత కాపాడటమే ధ్యేయంగా ఈ గ్రీన్ కార్యని ర్వాహక కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా అడవుల విస్తీర్ణాన్ని పెంచే ప్రక్రియలో భాగంగా నాగ బాబు నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. నాగబాబు సారథ్యంలో గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు, మొక్కలు నాటే ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. అలాగే వాటి పురోగతిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పర్యావరణానికి అనుకూలమైన విధానాలను రూపొందించడంతో పాటు ప్రకృతి వనరుల సంరక్షణకు అవసరమైన వ్యూహాలను అమలు చేయడంలో ఈ కమిటీ ప్రభుత్వం తరఫున పని చేస్తుంది. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, హరిత విప్లవం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంగా ఈ కమిటీ ఏర్పాటు, కమిటీ చైర్మన్ గా నాగబాబు నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. జల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపొందించే దిశగా నాగబాబు ఎలాంటి చర్యలు చేపడతారనే అంశంపై వ్యాపకంగా ఆసక్తి నెలకొంది.
Naga Babu, AP Green Executive Committee, Andhra Pradesh Government, Cabinet Rank, Janasena Leader Naga Babu
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/naga-babu-25-229070.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.