Publish Date:Aug 17, 2026
ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో ఉపయోగించిన దిమాగీ నక్సల్ పదం దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. దిమాగీ నక్సల్ అన్న పదం రాజకీయవర్గాలలోనే కాకుండా నెటిజనులలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది.
మావోయిజంపై ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ.. అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని తుడిచిపెట్టామని చెప్తూనే.. సిద్ధాంతపరంగా ఆలోచనల్లో ఉండే దిమాగీ నక్సల్స్ సమాజంలో ఇంకా మిగిలే ఉన్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన ప్రసంగం ముగిసిన గంటల వ్యవధిలోనే ఇన్స్టాగ్రామ్లో దిమాగీ నక్సల్ పార్టీ పేరుతో ఒక ఖాతా ప్రత్యక్షమైంది. ఈ ఇన్ స్టా ఖాతాకు నెటిజనుల నుంచి విశేష ఆదరణ లభించింది.
దిమాగీ నక్సల్ పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రారంభమైన 24 గంటల వ్యవధిలోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ ఈ ఖాతాలో 62 పోస్టులు ఉన్నాయి. ఈ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించి వైరల్ అవుతున్న దిమాగీ నక్సల్ పార్టీ పేజీ ఎవరు నిర్వహిస్తున్నారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. పేజీ నిర్వాహకులు తమ గుర్తింపును రహస్యంగా ఉంచడం, కంటెంట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా వెల్లడించకపోవడం సస్పెన్స్ గా మారింది. ఇది మోదీ వ్యాఖ్యలకు నిరసనగా సృష్టించిన వేదికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Dimagi Naxal, Narendra Modi speech, Instagram viral page, Dimagi Naxal Party, 16 lakh followers, Independence Day Modi comments
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dimagi-naxal-25-229075.html
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.