ఆవనూనెలోనూ ఆరోగ్యం ఉంది

Publish Date:Feb 10, 2021

Advertisement

భారతీయుల వంటకాల్లో ఆవాలకి ఎంత ప్రాధాన్యత ఉందో, వారి రోజువారీన జీవితంలో ఆవనూనెకీ అంతే ప్రాధాన్యత ఉండేది. పసిపిల్లల ఒంటికి మర్దనా చేయాలన్నా, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందాలన్నా ఆవనూనెకే తొలి ఓటు వేస్తారు భారతీయులు. ఉత్తరభారతదేశంలో అయితే ఒకప్పుడు వంటనూనెగా సైతం ఆవనూనెను వాడేవారు. ఆవనూనెని ఆహారంగా తీసుకుంటే, ఇందులోని Erucic acid వల్ల దుఫ్పలితాలు వస్తాయని కొన్ని పరిశోధనలు తేలుస్తుంటే, ఆవనూనెలోని Alpha-linolenic acid వల్ల గుండెకు మేలే జరుగుతందని మరికొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా రోజుకొకటిగా వెలువడే పరిశోధనల మాట అటుంచితే... జానపదుల వైద్య విధానంలో అనాదిగా ఆవనూనెను వాడుతూనే ఉన్నారు. వాటిలోంచి కొన్ని ఉపయోగాలు ఇవిగో...

 

ఒత్తయిన జుట్టు కోసం

ఆవనూనెతో కనుక తలకి మర్దనా చేస్తే జుత్తు నల్లగా ఒత్తుగా పెరుగుతుందంటారు పెద్దలు. ఆవనూనెతో తలకి మసాజ్‌ చేయడం వల్ల కుదుళ్లలోని రక్తప్రసరణ మెరుగుపడటమే కాదు... ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్‌ ఎ, ఇ, కేల్షియంలు జుత్తు ఎదుగుదలకు తోడ్పడతాయి. పైగా ఆవనూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల అది చుండ్రుని నివారించడంలో తోడ్పడుతుంది.

 

మిలమిలా మెరిసే పళ్లు

కాస్తంత ఉప్పు, వీలైతే నిమ్మరసం కలిపిన ఆవనూనెతో కనుక పళ్లను, చిగుళ్లను రుద్దితే... పంటి సమస్యలెన్నింటి నుంచో ఉపశమనం లభిస్తుందంటారు. చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, వయసుతో పాటుగా పళ్లు బలహీనపడిపోవడం, గారపట్టడం వంటి సమస్యలన్నీ తీరిపోతాయంటున్నారు.

 

చర్మానికి

చర్మానికి సంబంధించినంత వరకు, ఆవనూనె అద్భుతాలు చేస్తుండనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆవనూనెతో చర్మాన్ని మర్దనా చేయడం వల్ల స్వేదరంధ్రాలన్నీ శుభ్రపడతాయి. చర్మంలో పేరుకున్న మలినాలన్నీ తొలగిపోతాయి. పైపెచ్చు ఆవనూనెలో ఉండే పోషకాలు చర్మానికి నిగారింపుని తీసుకువస్తాయి. ఇక శనగపిండి, పెరుగు, నిమ్మరసం వంటివి కలిపిన ఆవనూనెను కనుక చర్మానికి కాసేపు పట్టించి ఉంచితే... ఒంటి మీద ఉన్న నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయన్నది నిపుణుల మాట.

 

శ్వాసకోశ వ్యాధుల్లో

దగ్గు, జలుబు మొదలుకొని ఆస్తమా, సైనసైటిస్‌ వంటి అనేక శ్వాసకోశ వ్యాధుల్లో ఆవనూనె ఉపశమనం కలిగిస్తుందన్నది ఓ నమ్మకం. విక్స్‌ బదులు కర్పూరం కలిపి ఆవనూనెను ఛాతీకి పట్టించడమే మంచిదంటారు. ఇక రోజుకి మూడు స్పూన్లు, తేనె కలిపిన ఆవనూనెను కనుక తీసుకుంటే... కఫం ఇట్టే కరిగిపోతుందంటున్నారు.

 

జీర్ణం జీర్ణం

కొంతమందికి అసలు ఆకలి వేయనే వేయదు. ఇలాంటివారు కనుక కాస్త ఆవనూనెను పుచ్చుకుంటే, శుభ్రంగా ఆకలి వేస్తుందంటున్నారు పెద్దలు. ఆవనూనెకు మన జీర్ణాశయంలో ఉన్న రసాయనాలను ప్రేరేపించే గుణం ఉండటంతో... ఆకలి వేయడం మొదలుకొని, తిన్న ఆహారం పక్వం కావడం వరకూ అన్ని చర్యలూ సాఫీగా సాగిపోయేలా తోడ్పడుతుంది. అజీర్ణం చేసినవారి పొట్ట మీద కాస్త ఆవనూనెను మర్దనా చేసినా కూడా తగిన ఫలితం కనిపిస్తుంది. ఇంతేకాదు! ఆవనూనె ఓ గొప్ప క్రమిసంహారిణి కూడా. అందుకే శరీరంలోనూ, చర్మం మీదా ఎలాంటి ఇన్ఫెక్షన్లు చోటు చేసుకున్నా కూడా.... వాటిని ఆవనూనె ఇట్టే అరికట్టేస్తుంది. ఆవనూనెతో వెలిగించే దీపం ఆఖరికి దోమలను కూడా తరిమికొడుతుందంటే, దాని ప్రభావం గురించి అంతకంటే రుజువేముంటుంది!

- నిర్జర.

By
en-us Political News

  
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.