ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా రాగి పాత్రలో నీరు తాగకూడదు..!
Publish Date:Apr 15, 2026
Advertisement
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి, రాగి పాత్రలో నీళ్లు తాగడం కొంతమందికి హానికరం కావచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకూ రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు? ఎందుకు తాగకూడదు? తెలుసుకుంటే.. రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు? రాగి నీరు ఎక్కువ ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి, కడుపులోని సున్నితమైన పొరను ప్రభావితం చేస్తుంది. కడుపులో పుండ్లు లేదా గ్యాస్ సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలో నీరు తాగితే మంట, నొప్పి , ఎసిడిటీ పెరగడం జరిగే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థకు రాగి పాత్రలో నీరు మరింత చికాకు పెడుతుంది. ఎసిడిటీ, అజీర్ణం.. ఇప్పటికే ఎసిడిటీ లేదా అజీర్ణంతో బాధపడుతున్న వారికి, రాగి నీరు తాగడం హాని చేస్తుందట. రాగి నీటిలోని కొన్ని పదార్థాలు కడుపులోని యాసిడ్ స్థాయిలను పెంచి, గుండెల్లో మంట, కడుపులో మంట , పుల్లటి త్రేన్పులకు దారితీస్తాయి. పిల్లలకు ఇవ్వకూడదు.. రోజుల వయసున్న శిశువుల నుండి పసిపిల్లల వరకు.. వారి జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రాగి నీరు పిల్లలలో తేలికపాటి నుండి తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. అంతేకాకుండా, పిల్లలు తాము తాగే నీటి పరిమాణాన్ని నియంత్రించుకోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. గర్భవతులు.. గర్భిణీ స్త్రీలు రాగి నీరు చాలా తక్కువ మాత్రమే తీసుకోవాలి. అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా ఇతర జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు, ఇవి తల్లికి , పిండానికి హానికరం కావచ్చు. రాగి నీరు తాగాలని అనుకునే వారు ముందు వైద్యుడిని సంప్రదించాలి, ఎందుకంటే ఇది కాలేయం , మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇది శరీరంలో టాక్సిన్లు తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగించి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. *రూపశ్రీ.
లివర్, కిడ్నీ వీక్నెస్..
http://www.teluguone.com/news/content/avoid-copper-water-if-you-have-these-health-problems-34-217417.html





