టీఆర్ఎస్ కు మునుగోడు భయం

Publish Date:Oct 16, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి భయం వెంటాడుతోందా? అందుకే ముందుగానే ఓటమికి కారణాలు వెతుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సింబల్స్ విషయంలో టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలో నెలకొన్న భయాన్నే సూచిస్తోందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎర్పడిన తరువాత ఇప్పటి వరకూ జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ టీఆర్ఎస్ కారు గుర్తుతోనే విజయం సాధించింది. ఆ తరువాత కూడా పలు ఉప ఎన్నికలలో కారు గుర్తుతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే తెరాస దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత మాత్రమే కారును పోలిన గుర్తులు ఉండటం వల్లనే ఓటమి పాలయ్యామని చెప్పుకుంది. ఇప్పుడు ముందుగానే ఆ విషయాన్ని గట్టిగా చెప్పడం ద్వారా ఇప్పటి నుంచే మునుగోడు ఉప ఎన్నిక ఓటమికి ఎక్స్యూజ్ వెతుక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభించేసింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎవరికీ కేటాయించవద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ నుంచి ఎలాంటి స్పందనలేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు టీఆర్ఎస్ నేతలు.

హౌజ్‌ మోషన్‌ విచారణ చేపట్టాలని శనివారం కోరగా కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది.  దీంతో సోమవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.  కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఎవరికీ కేటాయించరాదని  కోరుతూ  ఎన్నికల కమిషన్ ను ఈనెల 10న టీఆర్ఎస్ కోరిన సంగతి విదితమే.

 ‘కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందుకే ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించవద్దు’ అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు సీఈవోని కోరారు. అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు టీఆర్ఎస్ నేతలు. గతంలో పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా..కారును పోలినట్లు ఉండే ఈ గుర్తులతో బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు అధిక ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వారికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకీ టీఆర్ఎస్ అంటున్నది.

మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్‌రోలర్‌ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. అందువల్ల ఆ  గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ కోరుతోంది. ఈ విషయంమీదే హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమౌతోంది. 

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.