ఖర్గే వర్సెస్ థరూర్ అధ్యక్ష పీఠం ఎవరిదో?

Publish Date:Oct 16, 2022

Advertisement

ఇంచు మించుగా రెండున్నర మూడేళ్ళుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల  ముహూర్తం రానే వచ్చింది. సోమవారం ( అక్టోబర్ 17) కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకునేందుగా దేశ వ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల మందికి పైగా ఉన్న పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత లోక్ సభ ఎంపీ, శశి థరూర్’  పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 

భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర చాలా గొప్పది, ఎప్పుడో 137 ఏళ్ల నాడు, 1885 డిసెంబరు 25న మాజీ బ్రిటిషు అధికారి ఏ. ఓ. హుమే కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దేశ స్వాతంత్ర పోరాటం తుదిఘట్టంలో మహాత్మా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్ట అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం మాత్రం,ఇది ఆరవసారి. అయితే  అదంతా చరిత్ర. అలాగే, ఆ కాంగ్రేస్ ఈ కాంగ్రెస్ ఒకటేనా, అంటే అది మళ్ళీ వేరే చర్చ అవుతుంది. 1969 చీలికకు ముందున్న భారత జాతీయ కాంగ్రెస్’ ప్రస్తుత కాంగ్రెస్’, ఒకటి కాదనే వాదన ఒకటుంది.  

ఆ అంశాన్ని అలా పక్కన పెట్టి, ప్రస్తుతంలోకి వస్తే, అంతటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నిక జరుగుతోంది. ఈ 24 ఏళ్లలో ఇంచు మించుగా 22 ఏళ్లకు పైగా సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగారు. మధ్యలో కొద్ది కాలం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా, 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయడంతో మళ్ళీ సోనియా గాంధీనే, తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇదొక రికార్డ్. నెహ్రూ, ఇందిరా గాంధీ సహా ఎవరూ కూడా రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో లేరు. 

అదలా ఉంటే, గాంధీ కుటుంబం సభ్యులు (సోనియా, రాహుల్, ప్రియాంక) అధ్యక్ష పదవి వద్దనుకోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, అధ్యక్ష పదవి ముట్టేది లేదని భీష్మించుకు కూర్చోవడం వలన ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత జరిగిన అనేక నాటకీయ పరిణామాల నేపధ్యంగా గాంధీ కుటుంబ బయటి వ్యక్తులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్’ పోటీలో నిలిచారు. గాంధీ కుటుంబం తటస్థ వైఖరిని ప్రకటించినా, తెర వెనక తతంగం మరోలా  ఉందని, శశి థరూర్’ ఆరోపించారు. గాంధీల దృష్టిలో ఇద్దరు సమానమే కానీ , ఖర్గే కాసింత చాలా ఎక్కువ సమానం’ అనే ఆరోపణలు/విశ్లేషణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఖర్గే ఎన్నిక లాంచానమే అంటున్నారు. 

నిజానికి ఖర్గే గాంధీలకు విధేయుడు అనడంలో ఎవరికీ సందేహం లేదు. అయినా  ఖర్గే, పోలింగ్;కు గంటల ముందు కూడా తమ విధేయతను మరోమారు చాటుకున్నారు. రిమోట్ కంట్రోల్ అన్నా,ఇంకొకటన్న తాను పట్టించుకోనని అవమానంగా భావించనని  స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షునిగా గాంధీల సూచనలు సలహాలు తీసుకునేందుకు ఏమాత్రం సిగ్గు పడనని స్పష్టం చేశారు. ఒకటి రెండు ఎన్నికలలో ఓడి పోయినంత మాత్రాన గాంధీలను తప్పు పట్టడం సరికాదని, గాంధీలు దేశానికి, పార్టీకి చేసిన మేలును మరిచిపోలేమని అన్నారు.

మరో వంక శశి థరూర్’  కాంగ్రెస్ సిద్ధాంతాలకు సంబంధించి తనకు ఎలాంటి ఫిర్యాదు లేదని, అయితే పార్టీ పని విధానంలో మార్పు రావాలని, అన్నారు. ఖర్గే గెలిస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన యంగ్ టర్క్’ వాయిస్ వినిపించారు. మార్పు కోరుకునే యువకులంతా తన పక్షాన ఉంటే,యథాతథ స్థితిని కోరుకునే వృద్ధులు ఖర్గే పక్షాన ఉన్నారని చెప్పు కొచ్చారు. అయితే ఎవరు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు అందుకుంటారు అనేది, అక్టోబర్ 19 న తేలి పోతుంది.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.