కోమటి రెడ్డి బ్రదర్స్ ప్రతిష్టకు సవాల్ మునుగోడు?

Publish Date:Jul 25, 2022

Advertisement

కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలను అడ్గుకునేందుకే కమలం గూటికి చేరుతున్నారా? కాంగ్రెస్ లో ఇమడ లేకపోవడం అన్న అంశం కంటే తన అన్న వెంకటరెడ్డితో విభేదాలే ఆయనకు కాంగ్రెస్ వీడేలా చేస్తున్నాయా? ఇరువురి మధ్యా విభేదాల కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలకు అడుగడుగునా ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారా? కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి తీరు వల్లే వెంకటరెడ్డికి పీసీసీ పదవి దూరమైందా?

గత కొన్నేళ్లుగా ఇరువురి మధ్యా సఖ్యత లేదా అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. ఇరువురి మధ్యా విభేదాలను ఆసరాగా తీసుకునే కమలం రాజగోపాల రెడ్డిని రాజీనామా దిశగా ప్రోత్సహించిందని అంటున్నారు. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాలరెడ్డి రాజీనామా చేస్తే.. జరిగే ఉప ఎన్నికలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టను, ఆటు టీఆర్ఎస్ దర్పాన్నీ కూడా దెబ్బతీసేలా కమలం పావులు కదుపుతోందంటున్నారు. మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైతే..అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాలరెడ్డి రంగంలోకి దిగుతారు.

ఇప్పటికే  అది ఖాయమని భావిస్తున్న తెరాస ఉప పోరుకు సన్నాహాలు చేస్తోంది. వరాల మూటలు విప్పుతోంది. ఇక బీజేపీ రాజగోపాలరెడ్డిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటుందని ఇప్పటికే అమిత్ షా చెప్పేశారు. ఇక మిగిలింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఉప పోరుకు సిద్ధంగా లేదు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు ఉప పోరును ఎదుర్కోవడం ఇష్టం లేదు. కానీ అనివార్యమైతే మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత రాజగోపాలరెడ్డి అన్న అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అప్పగించాలని భావిస్తోంది. అంటే సోదరుల మధ్య ఇంత కాలం ఉన్న విభేదాలకు తోడు రాజకీయ వైరం కూడా తోడవుతుంది. ఒక వేళ మునుగోడు ఉప పోరు జరిగితే.. టీఆర్ఎస్ కంటే ఎక్కువగా గాభరా పడేది కాంగ్రెస్సే. అందుకే వ్యూహాత్మకంగా ఆ పోరును అన్నదమ్ముల మధ్య పోరులా మారిస్తే ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వచ్చినా.. రాజకీయంగా కాంగ్రెస్ కు కలిగే నష్టం కంటే వ్యక్తిగతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఎక్కువ నష్టం జరుగుతుంది.

పార్టీలో ఆయన హవాకు బ్రేక్ పడుతుంది. చీటికీ మాటికీ టీపీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పించే వెంకటరెడ్డి ఇక స్వరం మార్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదీ కాంగ్రెస్ వ్యూహం. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే మునుగోడు ఉప పోరులో విజయానికి సర్వశక్తులూ ఒడ్డేందుకు రెడీ అయిపోయింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడులో గులాబీ జెండా ఎగిరితే.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పార్టీలో నూతనోత్తేజం వస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఆత్మవిశ్వాసంతో సమాయత్తం అయ్యే అవకాశం వస్తుంది. ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వస్తే.. మునుగోడులో జరిగింది పార్టీల మధ్య పోరు కాదనీ, అది అన్నదమ్ముల సవాల్ కు సంబంధించిన విషయమంటూ లైట్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇక బీజేపీ విషయానికి వస్తే మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం సాధిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్ల కాంగ్రెస్, తెరాసాల గాలి తీసేసినట్లౌతుంది. ఒక వేళ ఫలితం ప్రతికూలంగా వస్తే కూడా ఆ పార్టీకి పోయేదేముండదు. కోమటిరెడ్డి కమలం గూటికి చేరాలంటే ఆయనకు ప్రజలలో ఉన్న ప్రతిష్ట ఏమిటో తెలుసుకోవడానికే రాజీనామా షరతు విధించామనీ, ఆయనకు ప్రజలలో బలం లేకపోవడం వల్లే పరాజయం పాలయ్యారనీ చెప్పుకుంటుంది.  మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో ఫలితం ఎలా వచ్చినా టీఆర్ఎస్, బీజేపీలకు పోయేదేమీ ఉండదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కనుక పరాజయం పాలైతే కోమటిరెడ్డి సోదరుల రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడుతుంది. వారి జోరుకు కళ్లెం పడుతుంది. ఏ విధంగా చూసినా మునుగోడు ఉప ఎన్నిక కోమటి రెడ్డి సోదరుల పర్సనల్ ఫైట్ గానే మిగిలిపోతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఉప ఎన్నిక ప్రభావం ఉంటుందని భావించలేమని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.