ములుగు జిల్లా రద్దు కాదు...మంత్రి సీతక్క క్లారిటీ
Publish Date:Jan 14, 2026
Advertisement
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ములుగు జిల్లా రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. జిల్లా కోసం పోరాడి ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తామన్నారు. కొత్త జిల్లాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని, శాస్త్రీయ పద్దతిలో స్వల్ప మార్పులు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రజలు ఆందోళన పడొద్దని సీతక్క సూచించారు. పలు యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై బురదజల్లేందుకే ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లాలో ఒక మండలం ఉంటుంది.. అందులోని ఐదు గ్రామాలు పక్కన భూపాలపల్లి జిల్లాలో ఉంటాయిని మంత్రి తెలిపారు. అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయి... రెవిన్యూ, పోలీసు సరిహద్దులు ఒకే లాగా ఉండాలని తెలిపారు. దీంతో జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది .అందుకే శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దు విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం చెప్పారని ఆమె తెలిపారు.
http://www.teluguone.com/news/content/mulugu-district-abolished-36-212518.html





