మంత్రి గుడివాడతో ముద్రగడ భేటీ..వైసీపీలోకి కన్ఫర్మ్?

Publish Date:Jul 28, 2023

Advertisement

ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు సెగలు రేపుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. సామజిక వర్గాల లెక్కలేసుకొని  మరీ రాజకీయంగా అడుగులేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పుడు కాపు సామజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు తెలుగుదేశం, వైసీపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పొత్తుగా వెళ్తాయనే ప్రచారం గట్టిగా జరుగుతున్న  సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ వ్యవహారం ఇంకా తేలలేదు కానీ.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ వర్గాలు పొత్తు ఖరారైనట్లేనని భావిస్తున్నాయి. ఇరు పార్టీల శ్రేణులూ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేస్తున్నాయి కూడా.  దీంతో వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ-జనసేన వైపు వెళ్లకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగమే ముద్రగడ పద్మనాభంను మళ్ళీ ఫోకస్ లోకి తేవడం.

కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి నాతో పోటీ చెయ్ అని పవన్ కు ముద్రగడ సవాల్ కూడా విసిరారు. ఇక రెండు సార్లు బహిరంగ లేఖలు  రాసారు. ముద్రగడ వ్యాఖ్యలు, లేఖలపై విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ముద్రగడ మీద తీవ్ర విమర్శలు గుపపించారు. అంతేకాదు  కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారని ముద్రగడ పేర్కొంటే.. జనసేన కార్యకర్తలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ మనీ ఆర్డర్లు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో ముద్రగడ అటాక్ అప్పుడే మొదలైంది. ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేయడం మొదలు పెట్టారో.. వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశమవ్వడం మొదలు పెట్టారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ నేతల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ  ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలవగా.. ఇప్పుడు హఠాత్తుగా విశాఖకు వచ్చిన ముద్రగడ.. గాజువాకలో మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ అయ్యారు. అమరనాధ్ తో ముద్రగడ భేటీ వివరాలేవీ వైసీపీ నేతలు  బయటకి రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ భేటీ వెనక ముద్రగడ రాజకీయ పునఃప్రవేశం, వచ్చే ఎన్నికలలో వైసీపీ నుండి పోటీకి దిగడం వంటి రాజకీయాలు అంశాలే ఉన్నాయని రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్నది. 

ముద్రగడ తెలుగుదేశం హయాం నుంచే వైసీపీకి టచ్ లో ఉన్నట్లు గోదావరి జిల్లా రాజకీయాలలో ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్ కాగా.. ఇక ఇప్పుడు ఆయన  ఓపెన్ అయిపోయారనీ, ఇక  వైసీపీలోకి జంప్ చేయడానికి రెడీ అయిపోయారనీ తెలుస్తున్నది. ఇప్పటికే ముద్రగడను కలిసిన వైసీపీ నేతలు ఈ మేరకు రాయబారం కూడా నడిపినట్లు చెబుతున్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాధ్ తో భేటీ వెనక కూడా కారణం ఇదే అయి ఉండవచ్చని చర్చ జరుగుతున్నది. నిజానికి ముద్రగడ,గుడివాడ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో కాపు ఉద్యమానికి మద్దతుగా గుడివాడ అమరనాధ్ తండ్రి, మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాధరావు నిలిచారు. ఆయనకూ ముద్రగడకు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో స్నేహితుని కుమారుడు మంత్రి అయిన గుడివాడను ఇప్పుడు ముద్రగడ కలిశారు. ఇక ముద్రగడ వైసీపీలోకి వస్తే పిఠాపురం సీటు ఇస్తారని తెలుస్తున్నది. ఎలాగో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు ప్రజలలో పెద్దగా పాజిటివ్  ఇమేజ్ లేదనీ,  దీంతో ఆయన్ని సైడ్ చేసి ముద్రగడని నిలబెడతారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పిఠాపురం కాకపోతే  కాకినాడ నియోజకవర్గం నుంచి ముద్రగడను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.   ఒకవేళ ముద్రగడ పోటీ కి విముఖత చూపితే.. కుమారుడిని రంగంలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు.  మొత్తానికి ముద్రగడ వైసీపీలోకి రావడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

By
en-us Political News

  
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.