కాపు ఉద్యమనేత‘ ముద్ర’గాయెబ్ పద్మనాభం!

Publish Date:May 3, 2024

Advertisement

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి,  కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది. చంద్రబాబుపై కోపమో.. పవన్ కల్యాణ్ నన్ను మించి ఎదిగిపోతాడనే భయమో కానీ, ముద్రగడ పద్మనాభం గజిబిజి అయిపోతున్నారు. పవన్ కల్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గంలో ఓడించడమే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా ఊగిపోతున్నాడు. పవన్ ను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కూడా ముద్రగడ పద్మనాభంలా వ్యక్తిగతంగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ముద్రగడకు పవన్, చంద్రబాబుపై కోపాన్ని వైసీపీ అధినేత చక్కగా వాడేసుకుంటున్నారు. అమ్మోరు వద్ద బలికి ఇచ్చే మేకపోతులా ముద్రగడను వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో వైసీపీ గెలిచినా ముద్రగడకు పెద్దగా ఉపయోగం ఉండకపోగా, వైసీపీ ఓడిపోతే చిక్కుల్లో పడేది ముద్రగడనే అనే వాదన ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ముద్రగడ కుమార్తె క్రాంతికి అర్ధమైంది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం తీరును పట్ల ఆమె అసహనం వ్యక్తంచేస్తూ ఏకంగా వీడియోను రిలీజ్ చేశారు. తన తండ్రిని జగన్, ఆయన టీం బాగా వాడుకుంటున్నారని, జగన్ మా నాన్నను వాడుకొని వదిలేయడం ఖాయమని చెప్పేశారు.

ఏపీలో కాపులకు పెద్ద మనిషిలా ముద్రగడ పద్మనాభం చలామణి అవుతున్నారు. ముద్రగడ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఏపీలోని కాపులందరూ అటువైపు ఉంటారనే అర్ధంపర్ధంలేని వాదన కూడా ఉంది. కానీ వాస్తవం  ఏమిటంటే.. ముద్రగడ ఏ పార్టీకి సపోర్టు చేస్తే ఆ పార్టీకి మెజార్టీ కాపులు వ్యతిరేకం అవుతారు. ఈ విషయం పలుసార్లు రుజువైంది. అయినా, తానే కాపు సామాజికవర్గానికి  పెద్దగా ఉండాలని ముద్రగడ తెగ ఆరాటపడిపోతుంటారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో గందరగోళానికి గురైన ముద్రగడ.. మళ్లీ పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదుగుతుంటేకూడా తెగ కంగారు పడిపోతున్నారు.   పవన్ కల్యాణ్ రాజకీయంగా బలపడితే కాపులందరూ తనను మర్చిపోతారేమోనన్న భయం ముద్రగడలో స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో, పవన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ముద్రగడ ఎంతదూరమైనా  వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఛాలెంజ్ సైతం చేశాడు. పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించక పోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చేసుకుంటానని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎవరైనా ఇలా మాట్లాడతారా. పవన్ పై ఎంత కోపం ఉంటే ముద్రగడ కులాన్నే మార్చేసుకునే స్థాయికి వెళ్లిపోతారు. ముద్రగడ ప్రస్తుత మానసిక పరిస్థితిని చూసి ఆయన సొంత సామాజికవర్గం వారే జాలిపడుతున్నారు. జగన్ శిబిరంలో బలి పశువుల్లో ఒకరిగా ముద్రగడను చూస్తున్నారు. ముద్రగడ తీరుతో ఆయన కుమార్తె సైతం విసుగెత్తిపోయినట్లున్నారు. ఆమె ఏకంగా వీడియోను రిలీజ్ చేశారు.

ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తన తండ్రి తీరును తప్పుబట్టారు. కేవలం పవన్ కల్యాణ్ ను తిట్టించేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే పద్మనాభం రెడ్డిగా పేరుమార్చుకుంటానని మా నాన్న అనడం బాధాకరమైన విషయం. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అస్సలు అర్ధం కాలేదు. వంగా గీతను గెలిపించేందుకు కష్టపడొచ్చు.. కానీ, పవన్, ఆయన అభిమానులను కించపరిచేలా  కామెంట్స్ ఉండకూడదు అంటూ ముద్రగడ కుమార్తె తండ్రికి సుద్దులు చెప్పారు. ఈ విషయంలో   నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.. పవన్ గెలుపుకోసం నా వంతు కృషి చేస్తానంటూ ముద్రగడకు గట్టి షాక్ ఇచ్చారు ఆయన కుమార్తె కావ్య. 

కుమార్తె క్రాంతి చేసిన వ్యాఖ్యలపై పద్మనాభం స్పందించారు. జనసేన నాయకులు తన కుటుంబంలో చిచ్చుపెట్టారని, తన కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడని శాపనార్ధాలు పెట్టారు. నా కూతురుతో కూడా నాపై తప్పుడు ప్రచారం చేయించారు. నా కుమార్తెకి ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుంచి ఆమె తన ప్రాపర్టీ కాదని, తన కుమారుడు మాత్రమే తన ప్రాపర్టీ అంటూ పద్మనాభం మాట్లాడటం చూస్తుంటే.. పవన్ పై కోపాన్ని కక్షగా మార్చడంలో జగన్ శిబిరం ముద్రగడకు ఏ స్థాయిలో శిక్షణ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి పవన్ కల్యాణ్ పట్ల ముద్రగడ ప్రవర్తిస్తున్న తీరుతో జనసైనికులతో పాటు కాపు సమాజం మొత్తం చీదరించుకుంటున్న పరిస్థితి. 

ముద్రగడలాంటి పాత కాపులను వైసీపీ ప్రయోగిస్తోంది.   సీరియస్ నేతగా ఇంతకాలం తన ముద్ర    నిలబెట్టుకున్న ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం తనను తాను దిగజార్చుకున్నారు. అసలు ఆయన కాపు ఉద్యమ కారులకు జనసేన నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉప్మా పెట్టాడంటూ గతంలో రాసిన లేఖతోనే కాపు సమాజంలో ఆయన ప్రతిష్ఠ పాతాళానికి దిగజారిపోయింది. అప్పట్లో కాపు యువత ఆయన ఇవిగో మేం తిన్న ఉప్మా డబ్బులు అంటూ మనీయార్డర్లు పంపించారు. అప్పడైనా ఆయనకు తన స్థితి, స్థాయి ఎంతగా దిగజారాయో అర్ధమై ఉండాల్సింది. కాలేదు. అయి ఉంటే ఇప్పుడు సొంత కుమార్తె తన తండ్రిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, ఆయనను నమ్మెద్దంటూ వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా?!  

By
en-us Political News

  
కబ్జాలకే ఆది గురువైన మల్లారెడ్డి స్థలాన్నే ఎవరో కబ్జా పెట్టారు. ఇది వింతల్లోకెల్లా వింత.. సరికొత్త ప్రపంచ వింత. 
Publish Date:May 18, 2024
మహాభారతంలో శకుని పాత్ర చాలా కీలకమైనది. తన దుష్టపన్నాగాలతో పాండవులను అంతమొందించాలని ప్రయత్నించి విఫలమై ఆ ప్రయత్నంలో కౌరవ నాశనానికి కారకుడైనాడు. సరిగ్గా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిచాణా ఎత్తేసే సూచనలు కనిపించడంతో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూటు మార్చాడు.  దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ‘పల్నాటి పిల్లి’ అనే బిరుదును, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ‘పల్నాటి పిల్ల పిల్లి’ అనే బిరుదులు ప్రదానం చేయడమైనది.
ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పల్నాడులో ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతున్న హింసాకాండ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు హింసాకాండపై చాలా సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించుకుని మరీ వివరణ కోరింది.
యూకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు పోటీ చేయబోతున్నారు. లేబర్ పార్టీ తరపున ఆయన బరిలో నిలవనున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ ఎంపీ అభ్యర్థిగా నాగరాజును లేబర్ పార్టీ ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హడావుడి ముగిసీముగియగానే పాలనపై దృష్టి పెట్టారు. శనివారం ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా రుణమాఫీకి నిధుల సమీకరణ విషయంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
ఓటుకు ఐదు వందలు పంచిన నేరం మీద ఎన్నికల కమిషన్ ఆయన్ని వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మే 18( శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఉల్లంఘించి మరీ అమలు చేసిన విధానాలను విపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు పలు మార్లు ప్రశ్నించారు. నిలదీశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాపాలనను మంటగలిపేస్తున్నారంటూ హయ్యస్ట్ అథారిటీస్ కు లేఖలు కూడా రాశారు. గవర్నర్, రాష్ట్రపతి, సీఎస్.. ఇలా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తట్టని తలుపు లేదు.
విషయాన్ని డైవర్ట్ చేసి తాము అనుకున్నది సైలెంట్ గా చేసుకుని పబ్బం గడిపేయడంలో వైసీపీ నేతలు డాక్టరేట్ సాధించారని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ వారు ఒకటి చేయాలనుకుంటే.. అందుకు భిన్నంగా విపక్ష నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తారు. అదే సమయంలో తాము చక్కబెట్టదలచుకున్న కార్యాన్ని సెలెంట్ గా చక్కబెట్టేస్తారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-18
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.