20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు కీలకం : మంత్రి నారా లోకేష్

Publish Date:May 13, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (NSE), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన “SME IPO – Alternative Funding Option For Growth” అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలకు మూలధన మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... యువగళం పాదయాత్రే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణ యువగళం పాదయాత్రలో తనకు ఎదురైన ఒక సంఘటన 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణగా నిలిచిందని మంత్రి లోకేష్ తెలిపారు. 

“226 రోజులు, 3132 కిలోమీటర్లు నడిచిన యువగళం పాదయాత్రలో ఎన్నో కుటుంబాల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను దగ్గరగా చూశాను. ఒకరోజు పెనుగొండలో కియా వద్ద సెల్ఫీలు దిగేందుకు దారుణమైన ఎండల్లో 23 కి.మీ నన్ను జాతీయ రహదారిపై నడిపించారు. అక్కడే కియా అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న పద్మావతి అనే చెల్లి నాతో కలిసి నడిచింది. కియా, అనుబంధ పరిశ్రమలు రాకముందు ఆమె గృహిణి. బాగా చదువుకుంది కానీ ఉద్యోగం చేయలేదు. 

కియా అనుబంధ సంస్థలు వచ్చిన తరువాత కుటుంబ సభ్యులను ఒప్పించి ఉద్యోగంలో చేరింది. నెలకు రూ.30 వేలు సంపాదిస్తోంది. అప్పటివరకు భర్త మీద ఆధారపడిన ఆమె, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని కూడా చూసుకుంటోంది. ఆమె కథ విన్న తరువాత నాకు ఉద్యోగ కల్పన ఎంత ముఖ్యమో అర్థమైంది. ఆ ఆలోచనల నుంచే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం పుట్టింది. మేము ఇచ్చిన మ్యానిఫెస్టో ‘సూపర్ 6’ హామీల్లో కూడా మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పనే. ఈ లక్ష్య సాధన కోసం అందరం పని చేస్తున్నాం.” అని పేర్కొన్నారు.

 పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ 

“గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌లా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయి. గూగుల్ రూ.1.35 లక్షల కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చాయి. వాటికి శంకుస్థాపనలు జరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాయలసీమలోని పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం ‘AMCA’ ప్రాజెక్టు కూడా ఏపీలో ఏర్పాటు కానుంది” అని వెల్లడించారు.

 గూగుల్ వల్లే క్యారియర్ ఏపీకి వచ్చింది – ఇదే మల్టిప్లయర్ ఎఫెక్ట్ 

“ప్రతి పెట్టుబడి వెనుక ఒక ప్రత్యేక కథ ఉంటుంది. డేటా సెంటర్లు వస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని చాలా మంది నన్ను ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా డేటా సెంటర్లు ఏర్పాటుకు విశాఖ నగరానికి అనేక కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ శంకుస్థాపన జరగగా, మరికొద్ది రోజుల్లో ఇంకో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానుంది. దానికి కూడా మంత్రివర్గం త్వరలో ఆమోదం తెలపనుంది. 

డేటా సెంటర్ ఎంత ముఖ్యమో, డేటా సెంటర్‌కు కావాల్సిన ఎకోసిస్టమ్ కూడా అంతే ముఖ్యం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడంతోనే రాయలసీమకు క్యారియర్ కంపెనీ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు భారీ స్థాయిలో కూలింగ్ సిస్టమ్స్ అవసరం అవుతాయి. ఆ అవసరాన్ని తీర్చేందుకు క్యారియర్ కంపెనీ శ్రీసిటీలో పెట్టుబడులు పెడుతోంది. దీనినే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. ఒక పెద్ద పెట్టుబడి వస్తే, దాని చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ” అని వివరించారు.

 క్లస్టర్ మోడల్‌తో అభివృద్ధి వికేంద్రీకరణ 

“మొదటిసారిగా మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కలిసికట్టుగా పని చేస్తున్నాం. ‘ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ’ ప్రభుత్వ లక్ష్యం. మన ఎకానమీ 200 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. దాని కోసం క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్ల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాం.
 
రాయలసీమలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ కోస్తాంధ్రలో CBG ప్లాంట్లు, ఆక్వా, అమరావతిలో క్వాంటం టెక్నాలజీ ఉత్తరాంధ్రలో ఫార్మా, డేటా సెంటర్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఐటీ రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలు కీలకం 

“మాకు గూగుల్ ఎంత ముఖ్యమో, రూ.50 లక్షలతో ప్రారంభమయ్యే ఎంఎస్ఎంఈ కూడా అంతే ముఖ్యం.  ఆర్సెలార్ మిట్టల్ ఎంత ముఖ్యమో, కోటి రూపాయలతో ప్రారంభమయ్యే చిన్న సంస్థ కూడా అంతే ముఖ్యం. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం సాధించాలంటే ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు అడుగులు వేస్తున్నాం. 

ప్రతి ఎంఎస్ఎంఈకి అనుమతుల నుంచి రాయితీల వరకు అన్ని ప్రక్రియలను సరళీకృతం చేస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లు ఎక్కడికీ వెళ్లకుండా అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు 20 లక్షలకు పైగా ఉన్నాయి. వాటన్నింటినీ ప్రోత్సహించే బాధ్యత ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిదే. ఇది సాధ్యం కావాలంటే ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కావాలి. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వాటి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అదే ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు.

 మూడు నెలల్లో 100 కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలి 

“NSE ద్వారా చిన్న కంపెనీలు పెద్ద సంస్థలుగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు NSEలో 723 కంపెనీలు లిస్టై రూ.22,415 కోట్ల నిధులు సమీకరించాయి. అందులో 158 సంస్థలు మెయిన్ బోర్డుకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సంస్థలు మాత్రమే NSEలో లిస్ట్ అయి రూ.100 కోట్ల నిధులు సమీకరించాయి. వచ్చే మూడు నెలల్లో కనీసం 100 కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ శాఖ పనిచేయాలి” అని సూచించారు.

 దేశం చూపు..మ‌న వైపు

ఔత్సాహికవేత్తల్లో పోటీతత్వం.. పట్టుదల ఉండాలి. మ‌న దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికి రావడం గర్వకారణం. పారిశ్రామికవేత్తలకు ఏ కష్టం వచ్చినా ఒక మెసేజ్ దూరంలో నేను ఉంటా.  ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న కంపెనీలు ప్రపంచ స్థాయి పెద్ద సంస్థలుగా ఎదగాలి. మరిన్ని ఉద్యోగాలు, మరింత‌మంది పారిశ్రామికవేత్తలు, మరిన్ని విజయగాథలు సృష్టిద్దాం” అని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు NSE సీఈఓ, ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కేశినేని శివనాథ్ (చిన్ని), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ ఎం. విశ్వ, SEBI, NSE, ఇండోరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్టీల్ సిటీ సెక్యూరిటీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.


 

By
en-us Political News

  
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు బుధవారం ట్రేడింగ్‌లో 1.35% పైగా పతనమైంది. గత 5 ఏళ్లలో 371% మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్‌ను ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో, నిపుణులు సూచించిన కీలక సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను ఇక్కడ తెలుసుకోండి.
విప్రో కంపెనీ రూ. 15,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ఆఫర్‌ను జూన్ 11 నుండి ప్రారంభించనుంది. మార్కెట్ ధర కంటే 25 శాతం అదనపు ప్రీమియంతో రూ. 250 ఆఫర్ ధరను ప్రకటించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు లాభదాయకమైన షేర్ ఎన్‌టైటిల్‌మెంట్ రేషియో, ముఖ్యమైన తేదీలు మరియు నిపుణుల సలహాలు ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు ఆఫీస్ ఉద్యోగాలలో ఏది ఎక్కువ డబ్బును ఆదా చేస్తుందో చాట్‌జిపిటి (ChatGPT) లెక్కలతో సహా తేల్చేసింది. రూ. 16 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగి అడిగిన ప్రశ్నకు ఏఐ ఇచ్చిన షాకింగ్ రిపోర్ట్, దాగివున్న ఖర్చులు మరియు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వివరాలు మీకోసం.
ముక్కోణపు వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఎ పై ఇండియా-ఎ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (101) మెరుపు సెంచరీ, తిలక్ వర్మ (60) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆఖరి ఓవర్లలో బౌలర్లు అద్భుతం చేయడంతో భారత్ 8 పరుగుల తేడాతో విజయం జెండా ఎగరేసింది. పూర్తి మ్యాచ్ హైలైట్స్ ఇక్కడ చూడండి.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. మోసద్దెక్ హొసైన్ అజేయ హాఫ్ సెంచరీ, నహీద్ రాణా 4 వికెట్లతో ఆసీస్ జట్టును ముంచేశారు. ఈ మ్యాచ్ పూర్తి హైలైట్స్ ఇక్కడ చూడండి.
హోర్ముజ్ జలసంధిలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేయడంతో, డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ మిలిటరీ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై భారీ క్షిపణి, వైమానిక దాడులు చేసింది. పశ్చిమ ఆసియా యుద్ధ తాజా అప్‌డేట్స్ ఇక్కడ చదవండి.
భార్యను మాట్లాడుకుందాం రా అంటూ ఇంటి బయటకు పిలిచిన భర్త అరుణ్.. ఒక్కసారిగా ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినిపించడం తో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా అక్కడ నిషారాణి రక్తపు మడుగులో పడి ఉంది.
2026లో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB), గోల్డ్ ఈటీఎఫ్ (ETF), మరియు డిజిటల్ గోల్డ్ లలో ఏది బెస్ట్? వాటిపై వచ్చే వడ్డీ, ట్యాక్స్ బెనిఫిట్స్ మరియు 3 శాతం జీఎస్టీ వివరాలతో కూడిన పూర్తి స్మార్ట్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ మీ కోసం.
బిట్‌కాయిన్ ధర అక్టోబర్ 2025 నాటి గరిష్ట స్థాయి $126,000 నుండి 50 శాతం పడిపోయింది. FTX సంక్షోభం తర్వాత అత్యంత ఘోరమైన వారాన్ని చవిచూసిన ఈ క్రిప్టోకరెన్సీ, తాజాగా మళ్లీ $60,000 మార్కును ఎలా దాటిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐటీ కారిడార్‌తో పాటు బేగంపేట, ఖైరతాబాద్ ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రాబోయే 48 గంటల IMD అలర్ట్ మరియు ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకునే లైవ్ టిప్స్ కోసం ఇప్పుడే చదవండి
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యంగ్ షట్లర్లు ఎమ్.ఆర్. అర్జున్, హరిహరన్ జోడీ అద్భుత విజయంతో బోణీ కొట్టింది. కేవలం 27 నిమిషాల్లోనే అమెరికా జంటను చిత్తు చేసిన పూర్తి వివరాలు, స్కోర్లు మీకోసం.
ముంబై టీ20 లీగ్ 2026 లో అర్జున్ టెండూల్కర్ కొట్టిన సిక్సర్ స్టాండ్స్ లోని చిన్నారికి తగిలింది. మ్యాచ్ ముగిసాక అర్జున్ ఆ అభిమానిని కలిసి చేసిన హృదయపూర్వకమైన పని వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆనందకుమార్ ఈ ఏడాది మే 25న దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పిటిషన్‌లో తాను తీవ్రమైన బైపోలార్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నానని, అందువల్ల మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో శిక్ష నుంచి ఉపశమనం, క్షమాభిక్ష ప్రసాదించాలని కోరాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.