ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్‌లకు రింగ్ రోడ్డు : సీఎం రేవంత్‌రెడ్డి

Publish Date:May 13, 2026

Advertisement

 

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ & డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సూచించారు. రాబోయే ఎయిర్‌పోర్టులను అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల్లో ఆధునిక సాంకేతికత వినియోగించాలని, ఖర్చులు తగ్గించేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ ప్రభావం తగ్గించేందుకు మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో ఏఐ సాంకేతికత వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.

సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ద్వారా శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వినియోగించేలా నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని, సింగరేణి సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సూచించారు.

అలాగే నల్గొండ–యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్–నాగోబా–బాసర–కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ ప్రత్యేక కారిడార్, కొత్తగూడం–పాల్వంచ–సుజాతనగర్ ప్రాంతాలను అనుసంధానిస్తూ మరో కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్లు భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
స్టీల్ ప్లాంట్ సందర్శనకు వైసీపీకి అనుమతి నిరాకరణ..
ఇరాన్ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కన్నుమూయడంతో ఆ దేశంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం ముగిసింది
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదమే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది...
తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా పరుగులు తీయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు.
రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మావిగన్‌కు కట్టుబడి ఉన్నాం..3 అటకెక్కినట్లేనా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు మరింత జటిలంగా మారాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.