బిగ్ బ్రేకింగ్.. అవినాష్‌రెడ్డి అరెస్ట్?.. ఢిల్లీలో క‌దిలిన‌ పావులు!

Publish Date:Feb 25, 2022

Advertisement

కడప మాజీ ఎంపీ, ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటు సెక్రటరీకి సీబీఐ ఇప్పటికే  ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్ ని 2019 మార్చి 15 న పులివెందులలోని ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్య చేయడం సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో తొలి నుంచీ అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. రకరకాల కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయంపైన కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వివేకా హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత వారు ఒక్కొక్క నిజాన్ని వెలుగులోకి తీస్తూ వచ్చారు. వివేకా కారు డ్రైవర్ అప్రూవర్ గా మారిన తర్వాత వివేకా హత్య కేసులో ఒక్కో ముడి విడిపోతూ వచ్చాయి. ముందు దస్తగిరి నుంచి, ఆ తర్వాత అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐ ముందు ఇచ్చిన వాంగ్మూలాలు అవినాష్ రెడ్డినే నిందితుడనే అనుమానాలు బలపరిచాయి.

వైఎస్ కుటుంబం నుంచి అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రతాపరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అవినాష్ రెడ్డే వివేకా హత్య వెనుక మాస్టర్ మైండ్ అనే సూచనలు వచ్చాయి. వివేకానందరెడ్డి అంటే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచీ వ్యతిరేకత ఉందనే నిజాన్ని ప్రతాపరెడ్డి వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు 2019 ఎన్నికల ముందు కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇవ్వొద్దని, తనకు కాకపోతే వైఎస్ విజయమ్మకో, షర్మిలకో ఇవ్వాలని వివేకానందరెడ్డి గట్టిగా పట్టుబట్టిన వైనం కూడా వైఎస్ ప్రతాపరెడ్డి వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం.

వివేకానందరెడ్డి హత్య అనంతరం ఘటనా స్థలానికి ముందుగా వెళ్లింది అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన ఇనయతుల్లా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. దాంతో పాటుగా వివేకానందరెడ్డి గొడ్డలిపోటుతో చనిపోతే.. గుండెపోటుతో మరణించారనే కథను అవినాష్ రెడ్డి అల్లారనే విషయం కూడా సీబీఐ ఎంక్వయిరీలో బయటికి వచ్చింది. అత్యంత దారుణంగా జరిగిన వివేకా హత్యను గుండెపోటు మృతిగా మార్చాలని చూడడం, ఘటనా స్థలంలో నేర ఆనవాళ్లను దగ్గర ఉండి మరీ తుడిపించడం, అప్పటి సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన అంశాలను క్రోడీకరించుకుని అవినాష్ రెడ్డి కుట్ర కోణం ఉందని సీబీఐ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. దాంతో పాటు తొలి నుంచీ వైఎస్ వివేకానందరరెడ్డి అంటే వ్యతిరేకించడమే కాకుండా తనకు ఎంపీ టికెట్ ఇవ్వద్దని చెప్పి తన రాజకీయ ఎదుగుదలకు వివేకా అడ్డుపడుతున్నారనే ఆక్రోశం కూడా వైఎస్ అవినాష్ రెడ్డిలో ఉందనే నిర్ధారణకు సీబీఐ అధికారులు వచ్చారని, ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారని ఢిల్లీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం.

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.