అవినాశ్‌కు టికెట్ ఇవ్వొద్ద‌న్న వివేకా!.. అందుకే హ‌త్య‌?.. సీబీఐ చార్జిషీట్‌

Publish Date:Feb 15, 2022

Advertisement

కడప మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా హత్య వెనుక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హస్తం ఉండి ఉండొచ్చనే విషయం సీబీఐ చార్జిషీట్లలో పేర్కొనడం సంచలనంగా మారింది. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడే అవినాశ్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారని, రక్తపు మరకలు శుభ్రం చేయించారని సీబీఐ పేర్కొంది. గుండెపోటుతో వివేకానందరెడ్డి మరణించారనే కథను ముందుగా శంకర్ రెడ్డితో కలిసి అవినాశ్ రెడ్డి అల్లారని, సాక్షి చానల్ కు వారి నుంచే తొలి సమాచారం వెళ్లిందని సీబీఐ వెల్లడించింది. ఈ కథనే చెప్పాలని సీఐని శంకర్ రెడ్డి బెదిరించినట్లు సీబీఐ పేర్కొది. తనకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని వివేకా అనడం వల్లే ఆయనను అవినాశ్ రెడ్డి హత్యచేయించి ఉంటారనే అనుమానం వ్యక్తం చేసింది. వివేకాను హత్య చేసినట్లు ఒప్పుకోవాలని గంగాధర్ రెడ్డికి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు కూడా సీబీఐ చార్జిషీట్లలో పేర్కొంది.

2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. వివేకా హత్యపై 2020 అక్టోబర్ 10న మొదటి చార్జిషీటు, ఈ ఏడాది జనవరి 31న మరో నివేదికను కోర్టుకు సీబీఐ సమర్పించింది. వివేకా గుండెపోటుతో మరణించినట్లు జరిగిన తప్పుడు ప్రచారం వెనుక అవినాశ్రెడ్డి పాత్ర ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ‘బాత్ రూమ్ లో వివేకానందరెడ్డి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. శంకర్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. గుండెపోటుతో వివేకా మరణించినట్లు అప్పటికప్పుడే కథ అల్లారు. ఈ లోగా అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. గుండెపోటుతో వివేకా మరణించినట్లు ప్రచారం చేయడంపై అందరూ చర్చించుకున్నారు. గంగిరెడ్డి, శంకర్ రెడ్డి మరికొందరితో కలిసి పనివారితో బెడ్ రూమ్ లో, బాత్ రూమ్ లో రక్తపు మరకలు శుభ్రం చేయించారు. వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా కట్లు కట్టించి, పులివెందుల ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు’ అని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అనుమానితుడిగా పేర్కొంది.

‘కడప ఎంపీ టికెట్ తనకైనా, వైఎస్ షర్మిలకైనా, లేదంటే వైఎస్ విజయమ్మకైనా దక్కాలని వివేకానందరెడ్డి గట్టిగా పట్టుపట్టారు. వైఎస్ అవినాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని వివేకా గట్టిగా చెప్పేవారు. ఈ నేపథ్యంలో తన ముఖ్య అనుచరుడు డి.శంకర్ రెడ్డితో అవినాశ్ రెడ్డే ఈ హత్య చేయించినట్లు అనుమానం ఉంది.. ఈ కోణంలో ఇంకా దర్యాప్తు జరుగుతోంది’ అని సీబీఐ తెలిపింది. పక్కా పథకం ప్రకారమే వివేకా మర్డర్ జరిగిందని సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేకాకు అత్యంత సన్నిహితులైన ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, డ్రైవర్ షేక్ దస్తగిరి ఈ హత్య కుట్ర పన్నినట్లు పేర్కొంది. ఇందు కోసం 40 కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు బెంగళూరులోని భూవివాదంసెటిల్మెంట్ సహా 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కారణమని పేర్కొంది. అవినాశ్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు అడ్డు తగులుతున్న వివేకాను తొలగించాలనే వ్యూహంలో భాగంగా హత్య జరిగినట్లు సీబీఐ స్పష్టంగా తెలిపింది.

వివేకాను హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని గంగాధర్ రెడ్డికి శంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. వివేకా శరీరంపై 7 గాయాలు ఉన్నాయని,మెదడుకు బలమైన గాయం తగలడం వల్లే ఆయన మరణించారని సీబీఐ తెలిపింది. వివేకా మద్దతుదారులను కంట్రోల్ చేయాని సీఐ శంకరయ్యను శివశంకర్ రెడ్డి బెదిరించినట్లు పేర్కొంది. రక్తపు మరకలను వివేకా ఇంటి పనిమనిషి రాగిరి లక్ష్మి చేత తొలగించడంలో శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి కలిసి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపింది. తర్వాత కాంపౌండర్ గజ్జల జయప్రకాశ్ రెడ్డి సహాయంతో శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి గదికి గడియపెట్టి కట్టు కట్టారని, బాత్రూం, బెడ్రూంలో రక్తపు మరకలు శుభ్రం చేసి, సాక్ష్యాధారాలు నాశనం చేయడంలో పాల్గొన్నారని  సీబీఐ వెల్లడించింది.

వివేకా హత్యకు సంబంధించిన ఆనవాళ్లను శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి తొలగించాలని చూశారు తప్ప ఆయన కుమార్తె సునీతకు సమాచారం ఇవ్వలేని సీబీఐ తెలిపింది. కుమార్తె లేకుండానే వివేకా అంతిమ సంస్కారాలు చేయాలని కూడా వారు యత్నించినట్లు పేర్కొంది. వివేకా హత్యకు నెల రోజుల ముందే పథకం రచించినట్లు సీబీఐ విచారణలో ఏ4 దస్తగిరి వెల్లడించాడు. వివేకా హత్యకు 40 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరినట్లు తనకు గంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి తెలిపాడు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.