విదేశాల్లో చదువుకున్న వ్యక్తి వచ్చి ఒక్కడో అమ్మాయిని ప్రేమించి పెళ్లాడతాడు. ఆనక ఓ కోటీశ్వరుడి కూతురు ప్రేమలో పడి ఆమెను పెళ్లాడబోతాడు.. మొదటి భార్య ఏడాది బిడ్డతో వచ్చి రామూ.. ఎందుకు ఇంత ద్రోహం చేశావ్.. అంటూ కొంగు, పిల్లాడి తలని తడిపేస్తూ ఏడిచి భారీ డైలాగు చెబుతుంది.. తర్వాత సంగతి వేరే.. ఇది దాదాపు పాత సినిమాల్లో చాలావాటిల్లో సీన్. ఇదే సీన్ నిజ జీవితంలోనూ జరిగితే.. అమ్మో!
అవకాశం లేకపోలేదు. ఉత్తరప్రదేశ్ లో ఒక పట్టణంలో ఇదే సీన్ జరిగింది. కాబోతే సదరు హీరోగారు అంతకు ముందే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, ఏడుగురు పిల్లల తండ్రి! జరిగేది ఐదో పెళ్లి. అయితే ఈ నిత్యపెళ్లి కొడుకు 55 ఏళ్లవాడు. విదేశీయుడూ కాదు, పక్కా లోకల్! పెళ్లి పిచ్చి ఉండాలేగాని ఇలాంటి దొంగపెళ్లిళ్లు చేసుకోవడానికి ఏదో ఒక దొంగ మార్గాన్ని ఇలాంటివారు వెతుకుతూనే ఉంటారు. కాబోతే, ఇలాంటివారికి దొరికే అమ్మాయిలే అమాయకులు. అమ్మాయి తల్లిదండ్రులకు ఏమాత్రం అనుమానం రాకుండా అతగాడు వ్యవహరించే ఉంటాడు. అయినా కనీస వివరాలు సేకరించకుండా పెళ్లికి సిద్ధప డటం పెద్ద ముప్పు తప్పిం చిందని ఆనక అనుకున్నారు.
నిత్యపెళ్లి కొడుకుకి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి, ఇద్దరు విడాకులిచ్చి వెళిపోయారు. మరో ఇద్దరు రహ స్యం గానే పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యకి ఏడుగురు పిల్లలు. హీరోగారు ఏం చేస్తుంటాడో ఆమెకు అంతగా తెలియదనే అనుకోవాలి. ఇతగాడు బహుశా అమ్మాయిల వేటనే వృత్తిగా చేసుకున్నాడేమో. మొత్తానికి అతనికి మరో అమ్మాయి వలలో పడింది. పెళ్లికి సిద్ధపడింది. పెళ్లిపీటలు ఎక్కారు. మరో కొద్ధిసేపట్లో తాళి కట్టాలి.
అంతలో సినిమాటిక్‌గా మిస్టర్ నిత్య పెళ్లికొడుకు రెండో భార్య ఏడుగురు పిల్లలతో సహా వచ్చింది. వేదిక మీద తండ్రిని చూసి పిల్లల్లో ఒకరిద్దరు నాన్నా.. అంటూ అరుస్తూ వేదిక మీదకి పరిగెట్టారు. ఈమె అయ్యో నా గతేంగాను అంటూ రుష్యేంద్రమణి స్థాయిలో కూలబడ ఏడవలేదు. అమాంతం అక్కడున్నవారికి కొత్త పెళ్లికొడుకు నా భర్తే అంటూ వాడి అసలు సంగతి చెప్పింది. తర్వాత ఏమి జరిగి ఉంటుందన్నది మీకూ అర్ధమయి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mother-25-143035.html
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.