అనుకున్నదొకటి ..అయినది ఇంకొకటి.. కేసీఆర్ బీహార్ యాత్ర

Publish Date:Sep 1, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, బీహార్ వెళ్ళారు. ఈ మధ్యనే బీజీపీతో తెగతెంపులు చేసుకుని, మహా ఘటబంధన్’(ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి)తో జట్టుకట్టిన  ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి లాలూ రబ్రీ తనయుడు తేజస్వి యాదవ్’తోనూ సమావేశమయ్యారు.

అవును,ముఖ్యమంత్రి బీహార్ వెళ్ళింది, గుల్వాన్ ఘర్షణలలో అమరులైన ఇద్దరు బీహారు అమరజవానుల కుటుంబాలకు, అదే విధంగా, ఇటీవల సికింద్రాబాద్’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస  కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకే, అయినా, అసలు పని మాత్రం అది కాదు. అది స్వామి కార్యం, స్వ కార్యం రాజకీయం.  అదే కోణంలో చూసినప్పుడు, కేసీఆర్ పాట్నా పర్యటన ఆశించిన లక్ష్యం సాధించక పోగా, ఇంటా బయట కొత్త సమస్యలకు శ్రీకారం చుట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 నిజానికి కేసీఆర్ ఇప్పటికే సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏ ముహూర్తాన, ఎందుకోసం ఆయన, జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్నారో, అందుకోసంగా ఏ క్షణాన కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారో గానీ, ఆక్షణం నుంచి ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రాజకీయాలు ఆయనకు ఏమాత్రం అచ్చిరావడం లేదు. 

అంతే కాదు, ఆయన జాతీయ రాజకీయ ప్రయత్నాలు, సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చింది అన్న రీతిన, కేసీఆర్ ఏరాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో రాజకీయం తలకిందులు అవుతోంది. ప్రభుత్వాలు సంక్షోభంలో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. మహా రాష్ట్ర విషయాన్నీ తీసుకుంటే, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వుంది, అయినా ఫలితం లేక పోయింది.కానీ, కేసీఆర్ ఇలా ముంబై  వెళ్ళి అలా శివసేన ఆధినేత ముఖమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత సరద పవార్ తో చర్చలు జరిపి వచ్చారు.ఈ మొత్తం వ్యవహారంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్’తో పోటీపడి మోడీ పై ఒంటి కాలు పై లేచారు. నెలరోజులు తిరక్కుండానే, ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి పోయింది.

సంజయ్ రౌత్ జైలు పాలయ్యారు.అలాగే, జార్ఖండ్ ముఖ్యమంత్రి, సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్’ కూడా కేసీఆర్’ను కలిసిన తర్వాతనే రాజకీయ రాజకీయ చిక్కుల్లో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టాలనే ఆలోచనను బయట పెట్టారో, అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆయన చుట్టూ ఉచ్చులు బిగిస్తోంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని పాటిస్తోంది. కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ అవినీతి టార్గెట్ గా  అస్త్రాలను సంధిస్తోంది. నిజానికి బీజేపీ, ఒక్క కేసీఆర్  తెరాస విషయంలోనే కాదు, ఎక్కడెక్కడ బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్నాయో, అక్కడక్కడల్లా, ముఖ్యంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తోంది. అయితే ఐటీ కాదంటే సీబీఐ అదీ కాదంటే ఈడీ అస్త్రాలను సంధించి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. మహారాష్ట్రలో శరద్ పవార్ అంతటి ఉద్దండ నేత పౌరోహిత్యంలో నడుస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీ, శివ సేన కూటమి,(మహా వికాస్ అఘాడీ) కూటమి ప్రభుతాన్ని కూల్చేసింది. అలాగే, మోడీ మీద పులిలా రంకెలు వేసిన మమతా బెనర్జీ, ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. పార్థా చటర్జీ అవినీతి  ‘భాండాగారం’ బయట పడిన తర్వాత ఆమె సైలెంట్ అయి పోయారు. 

అదే విధంగా ఓవంక ఢిల్లీలో మరో వంక ఝార్ఖండ్ లో హై డ్రామా నడుస్తోంది. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మూడు నెలలుగా జైల్లో ఉన్నారు. మరో వంక, మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పీకలలోతున కురుకుపోయారు. రేపో మాపో ఆయన కూడా జైలుకు పోవడం ఖాయమని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘంటాపథంగా చెపుతున్నారు. ఈ  స్కాంలో సీబీఐ 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1 గా మనీష్ సిసోడియా ఉన్నారు. 

ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.దేశ వ్యాప్తంగా సంచలనమైన ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తున్న ఢిల్లీ బీజేపీ ఎంపీ.. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.
మరో వంక కొంత కాలంగా కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గత ఎనిమిది ఏళ్లుగా సాగిన అవినీతి, అక్రమాలు బయటికి తీస్తున్నామని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా, ఇది, ఇది కాకపోతే అది, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ,ఆయన కుటుంబ అవినీతి పై ఫోకస్ పెట్టింది. సో, ఈ గండం నుంఛి బయట  పడేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరున రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారు.

ఇప్పుడు బీహార్ పర్యటన కూడా అందులో భాగమే, అయినా ఫలితం మాత్రం లేదు. ఇక్కడ ప్రగతి భవన్ లో తెలుగులో చెప్పిన కథనే అక్కడ పాట్నాలో,బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పక్కన కూర్చోపెట్టుకుని చెప్పుకొచ్చారు, కానీ నితీష్ కుమార్ విన్నంతవరకు విని చెప్పింది చాలని లేచి పోవడంతో, కేసీఆర్ ఇజ్జత్ పోయిందని అంటున్నారు. ఇంతకు ముందు ఝార్ఖండ్ వెళ్ళినప్పుడు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే లేచి పోయారు. సో .. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు అచ్చిరాలేదు అని మరో మారు రుజువైంది. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు ఇంట ఓడి రచ్చ గెలవాలంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.

By
en-us Political News

  
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.