Publish Date:Apr 25, 2025
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు. గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు.
Publish Date:Apr 25, 2025
కొన్ని శతాబ్దాల కిందట అంటే, ఐస్ ఏజ్ కాలం నాటి సంగతి. అప్పట్లో ఖండాలు ఒక్కోసారి విడిపోయి.. సముద్ర జలాలపై ప్రయాణిస్తూ.. వివిధ రకాల ప్రాంతాల్లో సెటిలయ్యేవని అంటుంది మన పురాతన భౌగోళిక చరిత్ర. అలా ఒక ఆఫ్రికా ఖండం నీటిపై ప్రయాణిస్తూ వచ్చి ఏషియా ఖండాన్ని ఢీ కొట్టిందనీ.. అలా మనకు హిమాలయా పర్వతాలు ఏర్పడ్డాయని అంటారు.
Publish Date:Apr 25, 2025
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం అధిష్టానం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది. పార్టీలో చంద్రబాబు సహచరుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
Publish Date:Apr 25, 2025
ఏపీసీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైందా? ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ అంజనేయులు అరెస్టైన రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ పోలీసు అధికారి అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఎవరైనా సరే ఔననే సమాధానమిస్తారు. ముంబై నటి కాదంబరి జత్మలానీపై అక్రమంగా కేసు నమోదు చేసి ముంబై నుంచి విజయవాడ తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించిన కేసులో పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ఇప్పుడు జగన్ హయాంలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ గా తన పరిమితులను మీరి, ఇష్టారీతిగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైంది.
Publish Date:Apr 25, 2025
జమ్మూ కశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు సాగించిన మారణకాండ మామూలు విషాదం కాదు. మాటలకందని మహా విషాదం. ముష్కర మూకలు సాగించిన రాక్షస కృత్యం. అవును. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తిన మహా విషాదం. ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన రాక్షస కృత్యం. బార్య కళ్ళెదుట భర్తను, పిల్లల కళ్ళెదుట తండ్రిని, తల్లి కళ్ళెదుట ఎదిగొచ్చిన కొడుకును తూటాలకు బలిచేసిన మహా ఘాతుకం.
Publish Date:Apr 25, 2025
పాక్ భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోందన్నడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి.
Publish Date:Apr 24, 2025
ప్రధాని నరేంద్ర మోదీ జీ అమరావతి పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అమరాతి పనుల పున: ప్రారంభోత్సవానికి మే 2వ రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
Publish Date:Apr 24, 2025
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం సమీపిస్తుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.
Publish Date:Apr 24, 2025
ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేల సంఖ్యలో జనం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
Publish Date:Apr 24, 2025
ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ ముక్త ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో గత కొంత కాలంగా భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు.
Publish Date:Apr 24, 2025
గత కొన్నేళ్ల నుంచి కొత్త కశ్మీరం ఆవిష్కరిస్తున్న వేళ.. ఎన్నడూ లేని విధంగా పర్యాటకులు సందడి చేస్తున్న సమయాన.. కాశ్మీరం నిజంగానే ఒక భూతల స్వర్గమా అనిపించింది. కశ్మీర్ భారత్ లో భాగం అయితే మనకు ఇంతటి భాగ్యం లభిస్తుందా? అన్న కోణంలో స్థానిక కశ్మీరీలు కూడా ఎంతో ఆనందంగా ఉన్న సందర్భం కూడా ఇదే.
Publish Date:Apr 24, 2025
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడితో.. భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో.. దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల.. వారు సాధించేదేమిటి? పహల్గాం ఉగ్రదాడి వెనకున్న అసలు కోణమేంటి? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది.
Publish Date:Apr 24, 2025
కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యింది. ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసేసింది. వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన పాక్ జాతీయులు మే ఒకటవ తేదీ లోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.